పత్తి కౌంటర్లపై అధికారుల దాడులు
టేకులపల్లి: అనుమతులు లేకుండా పత్తి కొనుగోళ్లు చేస్తున్న చిల్లర కౌంటర్లపై ఇల్లెందు వ్యవసాయ మార్కెట్ కమిటీ అధికారులు బుధవారం రాత్రి దాడులు నిర్వహించారు. కొందరు వ్యాపారులు అడ్డగోలుగా తూకం వేయడం, బిల్లులు, రికార్డులు నిర్వహణ సరిగా లేకపోవడం, లైసెన్సులు, అనుమతులు తీసుకోకపోవడం, నకిలీ రిజిస్టర్లు, బిల్లు బుక్‌లు వంటి వాటిని గుర్తించి మందలించారు. జరిమానా విధించారు. 8 కౌంటర్ల నుంచి కాటాలను స్వాధీనం చేసుకున్నారు. కాగా కొందరు వ్యాపారులు అధికారులతో వాగ్వాదానికి దిగారు. దాడుల్లో మార్కెట్ కమిటీ కార్యదర్శి నరేష్ కుమార్, సూపర్‌వైజర్ శ్రీనివాస్‌రావు, సిబ్బంది రంజిత్, మధు, శ్రీను, రమేష్, చందర్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment