మణుగూరుటౌన్: సింగరేణి కాలరీస్ మణుగూరు ఏరియాలోని కొండాపురం భూగర్భ గనిలో ఐదు రోజుల నుంచి నీటి నిల్వలు ఆకస్మికంగా పెరుగుతుండటంతో బొగ్గు వెలికితీతకు అంతరాయం ఏర్పడింది. ఈ నెల 6వ తేదీన నైట్ షిఫ్ట్ ముగింపు సమయం నుంచి 42 లెవల్ ఎం డిప్‌సైడ్ వద్ద ఉబికి వస్తున్న నీటి వల్ల బొగ్గు ఉత్పత్తికి తీవ్ర అంతరాయం ఏర్పడిందని అధికారులు చెబుతున్నారు. గనిలో చేరిన లక్ష గ్యాలన్ల నీటి నిల్వను తొలగించి ఉత్పత్తిని పునరుద్ధరించేందుకు ఏడు పంపులు ఏర్పాటు చేసినా పరిస్థితి అదుపులోకి రావడం లేదని తెలుస్తోంది. ఇప్పటివరకు సుమారు 1800 జీపీఎం నీటిని ఉపరితలానికి పంపింగ్ చేశారు. భూగర్భంలో భూమి పొరల నుంచి నీటి ప్రవాహం సర్వసాధారణమైనా ఐదు రోజులుగా ఉత్పత్తికి అంతరాయం ఏర్పడటం అధికారులు మిషన్లు, కార్మికులను ఉపరితలానికి తరలించి ఎమర్జెన్సీ ఆర్గనైజేషన్ ప్రకటించారు. ఆకస్మికంగా వచ్చిన నీటి ప్రవాహ పాయింట్‌ను తెలుసుకునేందుకు హైడ్రో జియోలజిస్టులు అన్వేషిస్తున్నారు. కాగా 2,500 టన్నుల బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడిందని డీజీఎం(పర్సనల్) ఒక ప్రకటనలో తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment