పాల్వంచ: ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పరీక్ష రాసేందుకు వెళ్లిన అభ్యర్థి బ్యాగ్‌లో రెండు సెల్ ఫోన్లు చోరీకి గురయ్యాయి. బాధితురాలి కథనం ప్రకారం.. ఈ నెల 10న వి.ప్రియాంక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పరీక్ష రాసేందుకు వెళ్లింది. అక్కడి సిబ్బంది సూచన మేరకు తన హ్యాండ్ బ్యాగ్‌ను పరీక్ష హాల్ ముందు పెట్టి లోపలికి వెళ్లి పరీక్ష రాసింది. పరీక్ష అనంతరం బయటకు వచ్చి చూడగా బ్యాగ్ ఓపెన్ చేసి ఉంది. బ్యాగ్‌లోని రూ.లక్ష విలువ చేసే రెండు సెల్‌ఫోన్‌లు చోరీకి గురయ్యాయి. బాధితురాలు బుధవారం రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. నాలుగు రోజుల క్రితం అక్కడ ఓ మోటార్ సైకిల్ ముందు బ్యాగ్‌లో ఉంచిన ఫోన్‌లు సైతం చోరీ అయినట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment