సీసీఆర్‌టీకి మణుగూరు ఉపాధ్యాయులు
మణుగూరు టౌన్: కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో రాజస్థాన్ రాష్ట్రం ఉదయపూర్‌లో నిర్వహించిన సెంటర్ ఫర్ కల్చరల్ రిసోర్సెస్ అండ్ ట్రైనింగ్ (సీసీఆర్‌టీ)లో మణుగూరు ఉపాధ్యాయులు బుధవారం పాల్గొన్నారు. మొత్తం 14 రాష్ట్రాల నుంచి 84 మంది ఉపాధ్యాయులు హాజరయ్యారు. 10 రోజులపాటు జరిగే ఈ కార్యక్రమంలో రాష్ట్రవ్యాప్తంగా ఎనిమిది మంది ఉపాధ్యాయులు ఎంపిక కాగా, వారిలో జిల్లా మణుగూరు మండలానికి చెందిన ఉపాధ్యాయులు వుయ్యూరు కోటేశ్వరరావు, పరమయ్య ఉన్నారు. సెమినార్‌లో తెలంగాణ రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలను, ఔన్నత్యాన్ని వివరించనున్నట్లు ఉపాధ్యాయులు పేర్కొన్నారు. వీరి ఎంపిక పట్ల ఉపాధ్యాయ సంఘాల నాయకులు, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు.
హత్యాయత్నం
కేసు నమోదు
అశ్వారావుపేటరూరల్: ఇంట్లో నిద్రిస్తున్న భార్యను హతమార్చేందుకు యత్నించిన భర్తపై పోలీసులు బుధవారం కేసు నమోదు చేశారు ఎస్సై టి.యయాతి రాజు కథనం ప్రకారం.. ఏపీలోని ఏలూరు జిల్లా గోపాలపురానికి చెందిన పెండ్ర రవి భార్య దుర్గ స్వగ్రామమైన అశ్వారావుపేట మండలం ఆసుపాక గ్రామానికి వచ్చి నివాసం ఉంటోంది. ఈ దంపతులకు ఇద్దరు సంతానం. భార్యపై అనుమానంతోపాటు కుటుంబ కలహాల నేపథ్యంలో కొంతకాలంగా భర్త వేరుగా ఉంటున్నాడు. అప్పుడుప్పుడు వచ్చి మద్యం మత్తులో గొడవ పడేవాడు. ఈ క్రమంలో శనివారం రాత్రి వచ్చిన రవి నిద్రిస్తున్న భార్యపై మంచం పట్టెతో నుదుటి, తలపై దాడి చేశాడు. దీంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. బాధితురాలు గట్టిగా కేకలు పెట్టడంతో కుటుంబీకులు మేల్కొని వచ్చేసరికి అక్కడి నుంచి పారిపోయాడు. ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్యం చేయించారు. పోలీసులకు ఫిర్యాదు చేయగా, నిందితుడిపై హత్యాయత్నం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment