సెల్‌ఫోన్లు రికవరీ.. అప్పగింత
కొత్తగూడెంఅర్బన్: జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో పోగొట్టుకున్న సెల్‌ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అప్పగించారు. ఈ మేరకు ఎస్పీ రోహిత్‌రాజు బుధవారం వివరాలు వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో సీఈఐఆర్ పోర్టల్ ద్వారా అందుకున్న ఫిర్యాదులతో మొబైల్ ఫోన్లను రికవరీ చేసినట్లు తెలిపారు. నెల రోజుల వ్యవధిలో 220 మంది ఫోన్లు రికవరీ చేసి బాధితులకు అప్పగించారు. సెల్‌ఫోన్ పోగొట్టుకున్నవారు సీఈఐఆర్ పోర్టల్‌లో వివరాలను కచ్చితంగా నమోదు చేస్తే పోలీసులు ట్రాక్ చేసి, స్వాధీనం చేసుకుంటారని తెలిపారు. ఈ సందర్భంగా సిబ్బందికి ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో డీసీఆర్బీ డీఎస్పీ మల్లయ్య స్వామి, ఐటీ సెల్ ఇన్‌చార్జి సీఐ నాగరాజురెడ్డి, ఐటీ సెల్ సభ్యులు విజయ్, రాజేష్, నవీన్, మహేష్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment