రాత్రంతా యార్డులోనే చిన్నారులు
అశ్వాపురం: మండల పరిధిలోని మొండికుంట గ్రామానికి చెందిన పర్శిక ప్రసాద్(10), కావ్య(8), నాగశ్రీ(7) మంగళవారం ఉదయం గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలకు వెళ్లారు. సాయంత్రం 4 గంటలకు పాఠశాల నుంచి ఇంటికి రాలేదు. పిల్లలు ఇంటి సమీపంలో ధాన్యం యార్డులో ఆడుకుని అక్కడే నిద్రపోయారు. రాత్రి వరకు పిల్లలు ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో సీఐ అశోక్‌రెడ్డి ఆధ్వర్యంలో ఎస్సై తిరుపతిరావు, సిబ్బంది, పిల్లల తల్లిదండ్రులు, మొండికుంట, మల్లెలమడుగు గ్రామాలకు చెందిన యువత రాత్రంతా పిల్లల కోసం వెతికారు. ఆచూకీ తెలియకపోవటంతో తల్లిదండ్రులు, బంధవులు ఆందోళన చెందారు. ఉదయం పిల్లలు ధాన్యం యార్డు సమీపంలో పడుకుని ఉండటాన్ని పోలీసులు, స్థానికులు గమనించి తల్లిదండ్రులకు అప్పగించారు. కాగా రాత్రంతా పిల్లల కోసం వెతికిన సీఐ అశోక్‌రెడ్డిని, సిబ్బందిని తల్లిదండ్రులు, స్థానికులు అభినందించారు.
ఆచూకీ తెలియక తల్లిదండ్రులు,
బంధువుల ఆందోళన
Comments
Please login to add a commentAdd a comment