బంకర్‌ను ఢీకొట్టిన డీజిల్ ట్యాంకర్
మణుగూరు టౌన్: సింగరేణి కాలరీస్ మణుగూరు ఏరియాలో త్రుటిలో పెనుప్రమాదం తప్పింది. 12 వేల లీటర్లతో ప్రయాణిస్తున్న డీజిల్ ట్యాంకర్ బుధవారం ఉదయం బంకర్‌ను ఢీకొట్టింది. వివరాలు ఇలా ఉన్నాయి. రోజూ మణుగూరులోని సింగరేణికి ఇతర ప్రాంతాల నుంచి డీజిల్ ట్యాంకర్‌లు వచ్చి ఏరియా స్టోర్స్ వద్ద దిగుమతి చేసి వెళ్తుంటాయి. అక్కడి నుంచి అవసరమైన గని ప్రదేశాలకు సింగరేణి డీజిల్ ట్యాంకర్ల ద్వారా తరలించుకుంటారు. ఈ క్రమంలో ఉదయం సమయంలో ఓసీ–4 వైపు నుంచి ఓసీ–2 కొత్త సైట్ ఆఫీస్ వైపు వెళ్తున్న సింగరేణి డీజిల్ ట్యాంకర్ కేసీహెచ్‌పీ మీదుగా వెళ్తూ సీ–21 వద్ద బంకర్‌ను ఢీ కొట్టింది. ఆ సమయంలో ట్యాంకర్‌లో దాదాపు 12 వేల లీటర్ల డీజిల్ ఉంది. త్రుటిలో పెను ప్రమాదం తప్పిందని అధికారులు, కార్మికులు ఊపిరి పీల్చుకుంటున్నారు. సంఘటనా స్థలాన్ని అధికారులు పరిశీలించారు. ఒకవైపు ఏరియాలో 55వ రక్షణ పక్షోత్సవాలు జరుగుతుండగా, మరోవైపు ప్రమాదం తప్పడం పట్ల వాహనం ఫిట్‌నెస్‌పై, రక్షణపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment