టిప్పర్, వ్యాన్ ఢీ.. ఇద్దరికి గాయాలు
సత్తుపల్లిటౌన్: ఎదురెదురుగా వచ్చిన బొగ్గు టిప్పర్, డీసీఎం వ్యాన్ ఢీకొనటంతో ఇద్దరికి తీవ్ర గాయాలైన ఘటన సత్తుపల్లిలో చోటుచేసుకుంది. మండలంలోని కిష్టారం ఓపెన్ కాస్ట్ నుంచి పెనుబల్లి వైపు వెళ్తున్న బొగ్గు టిప్పర్.. ఖమ్మం నుంచి సత్తుపల్లి వైపు ట్రావెలింగ్ బ్యాగ్‌ల లోడ్‌తో వస్తున్న డీసీఎం వ్యాన్.. బుధవారం ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ క్రమంలో వ్యాన్ దూసుకెళ్లి బ్రిడ్జి, చెట్టును ఢీకొని ఆగిపోయింది. వ్యాన్‌డ్రైవర్, ఏపీలోని కృష్ణా జిల్లా వత్సవాయికి చెందిన కె.రవి పక్కనే కాల్వలో పడగా ఆయన్ను కానిస్టేబుళ్లు ఇమ్రాన్, వంశీ, సుధాకర్ అతికష్టం మీద పైకి తీసుకొచ్చి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అలాగే, రుద్రంపూర్‌కు చెందిన బొగ్గు టిప్పర్ డ్రైవర్ శివకుమార్‌కు కూడా తీవ్ర గాయాలు కాగా ఆస్పత్రిలో చేర్పించి ప్రాథమిక చికిత్స అనంతరం ఇద్దరినీ ఖమ్మం తరలించారు. కాగా, సత్తుపల్లి – కిష్టారం మధ్య జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంతో ఇరువైపులా భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. దీంతో పోలీసులు గంట పాటు శ్రమించి రాకపోకలను క్రమబద్ధీకరించారు. ఘటనపై కేసు నమోదు చేసినట్లు సత్తుపల్లి సీఐ టి.కిరణ్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment