భద్రాచలంటౌన్: జిల్లాలోని ఆళ్లపల్లి, దమ్మపేట మాతా శిశు ఆరోగ్య అండ్ ఎపిడమిక్ బృందంలో వైద్యాధికారి ఖాళీలను కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేసేందుకు దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు భద్రాచలం ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ బి.రాహుల్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. గిరిజనులు, గిరిజన ప్రాతంలో పనిచేసిన అనుభవం ఉన్నవారికి మొదటి ప్రాధాన్యం ఉంటుందని పేర్కొన్నారు. ఏడాదిపాటు పనిచేయాలని, నెలకు రూ.52 వేల వేతనం చెల్లిస్తామని, అర్హులు ఈ నెల 27వ తేదీలోపు భద్రాచలం ఐటీడీఏలో దరఖాస్తు చేసుకోవాలని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment