కొత్తగూడెంఅర్బన్: హత్య కేసులో 15మందికి జైలు శిక్ష విధిస్తూ భద్రాద్రి జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్ శుక్రవారం తీర్పు చెప్పారు. వివరాలిలా ఉన్నాయి.. 2014 సెప్టెంబర్ 8న గణేశ్ నిమజ్జనం సందర్భంగా ఇల్లెందు 24 ఏరియాకు చెందిన పులిపాటి లోకేశ్ తనకు చెల్లె అయ్యే యువతిని అవినాష్ ప్రేమిస్తున్నాడని వార్నింగ్ ఇచ్చేందుకు షేక్ ఆరిఫ్, నీలమర్రి నాగరాజు, దేవరపల్లి జితేందర్‌రెడ్డి, ఏలుగు సమంత్, తాళ్లపల్లి వంశీ, బండి శ్రీకాంత్, కరకుపల్లి ప్రేమ్‌కుమార్, ఎట్టి వెంకటేశ్వర్లు, దడిగల నరేశ్, ఎడారి సంపత్, చింతలచెరువు రఘు, కుండోజు రాజు, బోశాల ఉదయ్‌కుమార్, సూరపాక గౌతమ్‌ను పిలిపించాడు. వీరంతా అవినాష్‌తో యువతికి జోలికిరానని ప్రమాణం చేయించారు. అదే సమయాన వారి మధ్య తగాదా జరగగా దాడులు చేసుకున్నారు. దీంతో దండు శ్రీను తదితరులు చేరుకుని అందరినీ పంపించారు. ఈమేరకు నాగరాజు, సమంత్ ఇచ్చిన సమాచారంతో వారంతా ఆయుధాలతో వచ్చి శ్రీను సహా ఐదుగురి పై దాడి చేయగా అప్పటి ఎస్సై బి.అశోక్ కేసు నమోదు చేశారు. ఘటనలో తీవ్రంగా గాయపడిన శ్రీను చికిత్స పొందుతూ 2017లో మృతి చెందగా ఆనాటి సీఐలు ఎన్.రమేశ్, ఏ.నరేందర్ కేసు నమో దు చేసి కోర్టులో చార్జ్‌షీట్ దాఖలు చేశారు. ఈమేరకు విచారణలో 15 మందిపై నేరం రుజువు కావడంతో ఆరిఫ్, నాగరాజు, దేవరపల్లి జితేందర్‌రెడ్డి, ఎలుగు సమంత్, పులిపాటి లోకేశ్, తాళ్లపల్లి వంశీ, బండి శ్రీకాంత్, కాకరపల్లి ప్రేమ్‌కుమార్, ఎట్టి వెంకటేశ్వర్లు, దడిగల నరేశ్, ఎడారి సంపత్, చింతలచెరువు రఘు, కుండోజు రాజు, బోశాల ఉదయ్‌కుమార్, సూరపాక గౌతమ్‌కు మూడేళ్ల జైలు శిక్ష, రూ.2వేల చొప్పున జరిమానా విధిస్తూ జడ్జి తీర్పుచెప్పారు. ప్రాసిక్యూషన్ తరఫున పీపీ లక్ష్మి వాదించగా ఎస్సై ప్రవీణ్‌తో పాటు ఎన్.వీరబాబు, శ్రీనివాస్ తదితరులు విచారణకు సహకరించారు.
Comments
Please login to add a commentAdd a comment