కొత్తగూడెంఅర్బన్: ఆంధ్రప్రదేశ్ నుంచి కొత్తగూడెం మీదుగా హైదరాబాద్‌కు తరలిస్తున్న నాలుగు కేజీల గంజాయిని త్రీటౌన్ పోలీసులు శుక్రవారం పట్టుకున్నారు. త్రీటౌన్ సీఐ శివప్రసాద్ కథనం ప్రకారం.. ఎస్‌ఐ విజయలక్ష్మి సిబ్బందితో కలిసి రైల్వేస్టేషన్ ఏరియాలో తనిఖీలు నిర్వహిస్తున్న నేపథ్యంలో ముగ్గురు అనుమానితులను గుర్తించి తనిఖీ చేయగా నాలుగు కేజీల గంజాయి దొరికింది. ఆంధ్రప్రదేశ్‌లోని డొంకరాయి నుంచి తీసుకొచ్చిన గంజాయిని హైదరాబాద్‌కు తీసుకెళ్తున్నట్లు గజ్వేల్‌కు చెందిన శ్రీనివాస్, బాలు, డొంకరాయికి చెందిన లక్ష్మణ్.. విచారణలో తెలిపారు. ముగ్గురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
గంజాయి తరలిస్తున్న వ్యక్తి అరెస్ట్
పాల్వంచ: స్కూటీపై గంజాయి తరలిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. శుక్రవారం పట్టణ అదనపు ఎస్‌ఐ రాఘవయ్య ఆధ్వర్యంలో బీసీఎంరోడ్‌లో వాహనాల తనిఖీ చేపట్టారు. భద్రాచలం వైపు నుంచి పాల్వంచ వైపు స్కూటీపై వస్తున్న వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించడంతో తనిఖీ చేశారు. అతని వద్ద 6.7 కేజీల గంజాయి గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం కొడవటంచ గ్రామానికి చెందిన ముద్దమల్ల శేషుగా గుర్తించి, అమ్మిన వ్యక్తితోపాటు హైదరాబాద్‌లో ఉండే మరో ఇద్దరిపై ఎస్‌ఐ సుమన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment