దరఖాస్తుల ఆహ్వానం | - | Sakshi
Sakshi News home page

దరఖాస్తుల ఆహ్వానం

Published Sat, Dec 21 2024 12:22 AM | Last Updated on Sat, Dec 21 2024 12:22 AM

దరఖాస

దరఖాస్తుల ఆహ్వానం

భద్రాచలంటౌన్‌: ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ పాఠశాలల్లో ఔట్‌ సోర్సింగ్‌ విధానం ద్వారా బోధన సిబ్బంది నియామకానికి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు భద్రాచలం ఐటీడీఏ పీఓ బి.రాహుల్‌ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. సంబంధిత కోర్సు ల్లో సాధించిన మార్కులు, డెమో ఆధారంగా ఎంపిక ఉంటుందని వెల్లడించారు. కెమిస్ట్రీ బోధనకు ఆరుగురు, ఫిజిక్స్‌ ఒకరితో పాటు నలుగురు స్టూడెంట్‌ కౌన్సిలర్లను నియమించనున్నట్లు తెలిపారు. ఆయా కోర్సుల్లో 50 శాతం మార్కులతో పీజీ ఉత్తీర్ణత సాధించి బీఈడీ పూర్తిచేయడమే కాక సీటీఈటీ, టెట్‌ పాసై ఉండాలని వెల్లడించారు. స్టూడెంట్‌ కౌన్సిలర్‌ పోస్టులకు సైకాలజీలో పీజీ లేదా గుర్తింపు ఉన్న యూనివర్సిటీ నుంచి గైడెన్స్‌, కౌన్సెలింగ్‌లో డిప్లొమా చేసి జాతీయస్థాయిలో ఏడాది అనుభవం కలిగిన వారు అర్హులని తెలిపారు. ఆసక్తి, అర్హతలు కలిగిన వారు ఈ నెల 27వ తేదీలోగా దరఖాస్తులు అందించాలని, వివరాల కోసం పనిదినాల్లో 80743 35630 నంబర్‌ ద్వారా సంప్రదించాలని పీఓ సూచించారు.

చిన్నారి మృతిపై విచారణ

ఇల్లెందురూరల్‌: మండలంలోని కొమరారం గ్రామంలో ఆరు నెలల చిన్నారి రుషిక మృతిపై పీహెచ్‌సీ వైద్యాధికారి లోహిత శుక్రవారం విచారణ చేపట్టారు. చిన్నారి మృతికి సంబంధించిన కారణాలను తల్లిదండ్రులను అడిగి తెలుసుకున్నారు. ముందుగా చిన్నారికి ఏర్పడిన అనారోగ్యం, అనంతరం ఆస్పత్రుల్లో అందించిన చికిత్సపై ఆరా తీశారు. సేకరించిన వివరాల ఆధారంగా నిమ్ము, లేదా ఫిట్స్‌తో మృతి చెంది ఉంటుందని వైద్యాధికారి అంచనా వేశారు. పూర్తిస్థాయి నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తామని డాక్టర్‌ లోహిత తెలిపారు.

పేకాట స్థావరంపై దాడి

భద్రాచలంఅర్బన్‌: ¿¶ {§é^èlË… ÕÐéÆý‡$ gêÐ]l*-Ƈ$$ÌŒæ ™ørÌZ °Æý‡Ó-íßæ-çÜ$¢¯]l² õ³M>r Ýë¦Ð]lÆý‡…Oò³ Ô¶æ${MýS-ÐéÆý‡… sê‹ÜP´ùÆŠḥÞ æ´ùÎ-çÜ$Ë$ §éyìl ^ólíÜ G°Ñ$¨ Ð]l$…¨° A§ýl$-ç³#-ÌZMìS ¡çÜ$-MýS$¯é²Æý‡$. ÐéÇ Ð]l§ýlª ¯]l$…_ Æý‡*.52 ÐólÌS ¯]lVýS§ýl$, 6 òÜÌŒæ¸ù¯]l$Ï, 3 ¨Ó-^èl{MýS-Ðé-çßæ¯é-ÌS¯]l$ ÝëÓ«-©¯]l… ^ólçÜ$MýS$° Ý린MýS ´ùÎ‹Ü õÜtçÙ-¯ŒSÌZ Aç³µ-W…-^éÆý‡$.

ప్రెజర్‌బాంబు పేలి ఇద్దరు జవాన్లకు గాయాలు

చర్ల: ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు ఏర్పాటుచేసిన ప్రెజర్‌బాంబు పేలగా ఇద్దరు జవాన్లకు తీవ్ర గాయాలైన ఘటన శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. ఛత్తీస్‌గఢ్‌లోని అబూజ్‌మడ్‌ ప్రాంతం నారాయణపూర్‌ జిల్లా కెచ్చాపాల్‌ టోరే మార్గంలో రహదారి నిర్మిస్తుండగా భద్రత కోసం జవాన్లు విధులు నిర్వర్తిస్తున్నారు. ఆ ప్రాంతంలో మావోలు అమర్చిన ప్రెజర్‌బాంబును గుర్తించని జవాన్లు తొక్కడంతో పేలగా ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో క్షతగాత్రులను జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మూడు రోజుల క్రితమే దంతెవాడ జిల్లాలోని బార్సూర్‌ సమీపాన ప్రెజర్‌బాంబు పేలగా కట్టెల కోసం వెళ్లిన ఓ గిరిజనుడు మృతి చెందాడు. మళ్లీ ఇలాంటి ఘటనే జరగడంతో అటు గిరిజనులు, ఇటు భద్రతా బలగాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.

రోడ్డు ప్రమాదంలో ఒకరికి...

ఇల్లెందు: ఇల్లెందు – ఖమ్మంరోడ్డులో లలితాపురం ఐటీఐ సమీపంలో జాల విశాల్‌ను ఓ వాహనం ఢీకొట్టింది. విశాల్‌ తండ్రి ఉమాశంకర్‌ ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ సూర్య కేసు నమోదు చేశారు.

కేసు నమోదు..

భద్రాచలంఅర్బన్‌: భద్రాచలం పట్టణంలోని ఎస్‌ఆర్‌ఎన్‌ కాలనీకి చెందిన వ్యక్తి ఇంట్లో నగదు చోరీకి గురైనట్లు శుక్రవారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. పోలీసుల కథనం ప్రకారం.. వారం రోజులుగా ఎస్‌ఆర్‌ఎన్‌కాలనీకి చెందిన ఓ కుటుంబం ఓ గుడిలో నిద్ర చేయాల్సి వచ్చింది. కార్యక్రమం పూర్తయ్యాక శుక్రవారం ఉదయం ఇంటికి చేరుకున్న కుటుంబ సభ్యులు ఇంటి తాళం పగలకొట్టి ఉండటాన్ని గమనించి బిరువాను తెరిచి చూడగా అందులో ఉండాల్సిన రూ.80 వేల నగదు కనిపించలేదు. శుక్రవారం సాయంత్రం ఇంటి యజమాని స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా టౌన్‌ ఎస్‌ఐ శివరామకృష్ణ కేసు నమోదు చేశారు.

దాడి చేశారని...

ఇల్లెందు: మండలంలోని సేవ్యాతండాకు చెందిన ఆంగోతు వీరన్నపై అదే గ్రామానికి చెందిన సురేశ్‌, కమల, లాలు, రూప్‌సింగ్‌, రాజేశ్వరి దాడి చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ బి.సూర్య కేసు నమోదు చేశారు.

గుండెపోటుతో హెచ్‌ఎం మృతి

దమ్మపేట: గుండెపోటుతో ప్రభుత్వ పాఠశాల హెచ్‌ఎం మృతి చెందారు. మండలంలోని గట్టుగూడెం ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల హెచ్‌ఎం డి.ఫణికుమార్‌రెడ్డి.. గురువారం విధులు ముగించుకుని, సత్తుపల్లిలోని నివాసానికి చేరుకున్నాక గుండెపోటు వచ్చింది. కుటుంబ సభ్యులు ఆయన్ను ఖమ్మం ఆస్పత్రికి తరలిస్తుండగానే కన్నుమూశారు. విషయం తెలుసుకున్న ఎంఈఓ కీసర లక్ష్మి, నాచారం కాంప్లెక్స్‌ హెచ్‌ఎం జగపతయ్య, యూటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి రాజు, యూటీఎఫ్‌ జిల్లా నాయకులు వెంకటేశ్వర్లు, రమేశ్‌కుమార్‌ శుక్రవారం హెచ్‌ఎం మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
దరఖాస్తుల ఆహ్వానం1
1/1

దరఖాస్తుల ఆహ్వానం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement