పెండింగ్ స్కాలర్‌షిప్ వివరాలు సమర్పించండి
కొత్తగూడెంరూరల్ : జిల్లాలో బీసీ సంక్షేమ శాఖ పరిధిలోకి వచ్చే ప్రభుత్వ, ప్రైవేట్ యూనివర్సిటీలు, ఇంజనీరింగ్, మెడికల్ ఇతర కళాశాలల్లో పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్‌ల వివరాలు అందజేయాలని బీసీ సంక్షేమాధికారి ఇందిర తెలిపారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. 2017 – 18 నుంచి 2024 – 25 వరకు ఉపకార వేతనాల హార్డ్ కాపీలను జనవరి 20లోగా తమ కార్యాలయంలో సమర్పించాలని సూచించారు.
సింగరేణిలో ‘నూతన’ వేడుకలు రద్దు
సింగరేణి(కొత్తగూడెం): మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్‌సింగ్ మృతితో రాష్ట్ర ప్రభుత్వం వారంరోజులపాటు సంతాప దినాలుగా ప్రకటించిందని, దీంతో సింగరేణిలో నూతన సంవత్సర వేడుకలు రద్దు చేస్తున్నామని పర్సనల్ జీఎం (వెల్ఫేర్ అండ్ ఆర్సీ) కోడూరి శ్రీనివాసరావు తెలిపారు. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.
‘ఇస్రోస్టాట్’కు సింగరేణి కళాశాల ఎంపిక
సింగరేణి(కొత్తగూడెం): ఇస్రోస్టాట్ ప్రోగ్రామ్‌కు కొత్తగూడెంలోని సింగరేణి మహిళా డిగ్రీ, పీజీ కళాశాల ఎంపికై ందని, నోడల్ అధికారిగా డాక్టర్ జి.శైలజ (కెమిస్ట్రీ హెచ్‌ఓడీ) ఎంపికయ్యారని సింగరేణి ఎడ్యుకేషన్ సొసైటీ సెక్రటరీ గుండా శ్రీనివాస్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులకు పరిశోధనలపై అవగాహన కల్పించేందుకు ఇస్రో ఆన్‌లైన్‌లో శిక్షణ ఇస్తోందని, ఈ క్రమంలో సింగరేణి విద్యాసంస్థలను సెంటర్ ఫర్ ఎక్స్‌లెన్సీగా తీర్చిదిద్దేందుకు దరఖాస్తు చేశామని పేర్కొన్నారు. జనవరి 9 నుంచి 27 వరకు ఆన్‌లైన్‌లో శిక్షణ తరగతులు ఉంటాయని, పరీక్షలు కూడా ఆన్‌లైన్‌లోనే నిర్వహించి పాల్గొన్న విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇస్తారని వివరించారు.
అంబులెన్స్‌ల్లో
ఆకస్మిక తనిఖీలు
ఇల్లెందు: ఇల్లెందులోని 102, 108, 1962 అంబులెన్స్‌లను ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రోగ్రామ్ మేనేజర్ భూమా నాగేందర్ సోమవారం తనిఖీ చేశారు. వాహనాల రికార్డులు, ఎమర్జెన్సీ కేసుల వివరాలపై ఆరా తీశారు. జీపీఎస్ ట్యాబ్‌పై సిబ్బందికి అవగాహన కల్పించారు. అంబులెన్‌ల్లోని మందులను తనిఖీ చేసి పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో ఈఎంటీ రేణుకాదేవి, పైలట్ శ్రీనివాస్, సునిల్, సాయి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment