ఇక ఆరు రోజులే..
మున్సిపల్ పాలకవర్గాల పదవీ కాలం త్వరలో ముగియనుంది. ఈ నెల 26 నుంచి చైర్‌పర్సన్లు, కౌన్సిలర్లు మాజీలు కానున్నారు. మిగిలిన ఐదారు రోజుల్లో కూడా తమ మార్కు చూపించేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం మున్సిపాలిటీల్లో ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డుల సర్వే జరుగుతోంది. సర్వేలో అధికారులతోపాటు వార్డు కౌన్సిలర్లు కూడా ఇంటింటికి వెళ్తున్నారు. ప్రజలతో మమేకమయ్యే ప్రయత్నం చేస్తున్నారు. చివరిగా కొత్తగూడెం మున్సిపల్ వార్డుల్లోని అన్ని వీధుల్లో కౌన్సిలర్ పేరు, వీధిలోని ఇంటి నంబర్ల సంఖ్యతో బోర్డులు ఏర్పాటు చేయిస్తున్నారు.
– కొత్తగూడెంఅర్బన్
ప్రత్యేకాధికారులుగా ఆర్డీఓలు?
ఇప్పటికే సర్పంచ్‌లు, ఎంపీటీసీల పదవీ కాలం ముగిసి పంచాయతీలు, మండల పరిషత్, జిల్లా పరిషత్‌ల్లో ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతోంది. ఈ నెల 26వ తేదీతో పాలకవర్గాల పదవీ కాలం ముగియనుండటంతో మున్సిపాలిటీల్లో కూడా ప్రత్యేక అధికారుల పాలన సాగే అవకాశం ఉంది. మున్సిపాలిటీలకు ఆర్డీఓలు ప్రత్యేక అధికారులుగా వ్యవహరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సర్పంచ్, ఎంపీటీసీ ఎన్నికలపై ఇంకా స్పష్టత లేదు. అదే మాదిరి మున్సిపాలిటీల్లో కూడా ఎన్నికలు ఆలస్యమవుతాయా? వాటితో పాటు ఎన్నికలే నిర్వహిస్తారా? అనే చర్చ సాగుతోంది. ఎన్నికలు ఎప్పుడు జరిగినా ఎదుర్కొనేందుకు కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు సిద్ధమవుతున్నారు. కాగా ఐదేళ్ల పదవీకాలంలో మున్సిపల్ పాలకవర్గ సభ్యులు పలు అభివృద్ధి పనులు చేపట్టారు. ఎన్నో అవినీతి ఆరోపణలు కూడా ఎదుర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment