ప్రక్షాళన చేసినా..
ఖమ్మం జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా సబ్ రిజిస్ట్రార్ల తీరుపై వచ్చిన విమర్శలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉద్యోగులు మొదలు సబ్ రిజిస్ట్రార్లు, జిల్లా రిజిస్ట్రార్లను వేర్వేరు జిల్లాలకు బదిలీ చేశారు. అయినా ఖమ్మం జిల్లాకు కొత్తగా వచ్చిన సబ్ రిజిస్ట్రార్ల తీరు మారడం లేదు. ఖమ్మం రూరల్ సబ్ రిజిస్ట్రార్ కావాలనే కొన్ని డాక్యుమెంట్లను పక్కన పెడుతున్నారని, గతంలో రిజిస్ట్రేషన్ చేసిన వెంచర్‌లోనే ఇంకొందరు తమ స్థలాల రిజిస్ట్రేషన్‌కు వెళితే పట్టించుకోవడం లేదంటూ పదుల సంఖ్యలో ఫిర్యాదులు పొంగులేటికి చేరగా.. ఆయన అధికారిణి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. అలాగే వైరా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో జరిగిన ఘటనపైనా మంత్రి తీవ్రంగా స్పందించి జిల్లా రిజిస్ట్రార్‌ను మందలించినట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment