గ్రామసభలకు ఏర్పాట్లు చేయాలి
సూపర్‌బజార్(కొత్తగూడెం): గ్రామసభల నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అధికారులను ఆదేశించారు. రేషన్‌కార్డులు, రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాల సర్వే గ్రామసభల నిర్వహణపై ఆదివారం రాత్రి అదనపు కలెక్టర్లు డి.వేణుగోపాల్, విద్యాచందన, జెడ్పీ సీఈఓ నాగలక్ష్మి, ఆర్డీఓలు, తహసీల్దార్లు, డీఏఓ, డీఎస్‌ఓ, డీఎం సివిల్, ఎంపీడీఓలు, వ్యవసాయాధికారులు, మున్సిపల్ కమిషనర్లతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. సర్వే పురోగతిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 21 నుంచి 23 వరకు గ్రామసభలు నిర్వహించాలన్నారు. సభలకు హాజరయ్యే ప్రజలకు మౌలిక సదుపాయాలను కల్పించాలని కోరారు. గ్రామసభల్లో వచ్చిన దరఖాస్తులను స్వీకరించడంతోపాటు ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తులను కూడా పరిశీలిస్తామని చెప్పారు. ప్రస్తుతం ప్రచారంలో ఉన్న రేషన్‌కార్డుల లబ్ధిదారుల జాబితా కులగణన సర్వే ఆధారంగా తయారుచేసిందని, ఇది తుది జాబితా కాదని చెప్పారు. ప్రజాపాలన సేవా కేంద్రాల్లో కూడా కొత్త రేషన్‌కార్డులకు, కొత్త సభ్యుల చేర్పునకు దరఖాస్తులు స్వీకరిస్తామని చెప్పారు. ఇంకా మిగిలిన సర్వే సోమవారంలోగా పూర్తి చేయాలన్నారు. ఇందిరమ్మ ఇళ్లకు ఇంటిస్థలం ఉన్న వారి జాబితా, లేనివారి జాబితాలను గ్రామసభల్లో ప్రదర్శించాలని ఆదేశించారు.
● కలెక్టర్ జితేష్ వి.పాటిల్
Comments
Please login to add a commentAdd a comment