యూసుఫ్ కప్ విజేత కొత్తగూడెం జట్టు
బూర్గంపాడు: బూర్గంపాడు ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో వారం రోజులుగా ఉత్కంఠ భరితంగా సాగిన యూసుఫ్ మెమోరియల్ 17వ క్రికెట్ టోర్నీ ముగిసింది. ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో సారపాక గుంటుపల్లి ఎలెవన్ జట్టుపై కొత్తగూడెం ఫరీద్ ఎలెవన్ జట్టు విజేతగా నిలిచింది. కొత్తగూడెం జట్టులోని నితిన్ 56 పరుగులు చేసి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు. ముగింపు వేడుకలకు పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ముఖ్యఅతిథిగా హాజరై విన్నర్, రన్నర్ జట్లకు ట్రోఫీలు, నగదు బహుమతులను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టోర్నమెంట్‌లతో క్రీడా నైపుణ్యం మెరుగుపడుతుందన్నారు. 17 ఏళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన స్థానిక క్రికెటర్ యూసుఫ్ జ్ఞాపకార్థం అతని స్నేహితులు ప్రతిఏటా టోర్నీ నిర్వహించటం అభినందనీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గుగులోత్ కిషోర్, శివరాం నాయక్, బుద్ధరాజు నవీన్‌బాబు, డేగల రాజుయాదవ్, పోతిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి, బి.నాగేశ్వరరావు, సోహైల్ పాషా, సర్వేశ్వరరావు, గోనెల నాని, భజన సతీష్, భజన ప్రసాద్, అబ్దుల్ సలీమ్, సారధి, సత్తిపండు, కిషోర్, మంద ప్రసాద్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment