ముంబై : ఓమిక్రాన్ వ్యాప్తి, కరోనా నిబంధనలు, థర్డ్‌వేవ్ హెచ్చరికల నేపథ్యంలో స్టాక్‌మార్కెటలో సూచీలు లాభనష్టాల మధ్య ఊగిలసాడుతున్నాయి. షేర్ల ధరలకు కనిష్టాల దగ్గర నమోదు కావడంతో ఇన్వెస్టర్లు కొనుగోలుకు సిద్ధంగా ఉన్నా మరోవైపు లాక్‌డౌన్ భయాలు మార్కెట్‌ను కమ్మేస్తున్నాయి. మరోవైపు డిసెంబరు ఆఖరుతో ఎఫ్ అండ్ ఓ డెరివేటిక్ కాంట్రాక్టులు ముగుస్తుండటంతో మార్కెట్ సూచీలు ఒత్తిడికి లోనవుతున్నాయి.
ఈ రోజు ఉదయం 9:10 గంటల సమయానికి బీఎస్‌ఈ సెన్సెక్స్ 91 పాయింట్లు నష్టపోయి 57,806 పాయింట్ల దగ్గర ట్రేడవుతుండగా ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 12 పాయింట్లు నష్టపోయి 17,201 పాయింట్ల దగ్గర కొనసాగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment