ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు భారీ నష్టాలతో ముగిశాయి. ఉదయం స్వల్ప లాభాలతో ప్రారంభమైన సూచీలు గరిష్ఠ స్థాయి వద్ద ఉన్న నేపథ్యంలో మదుపరులు అప్రమత్తంగా వ్యవహరించారు. లోహ, బ్యాంకింగ్, ఫార్మా షేర్లు భారీగా అమ్మకాల ఒత్తిడి ఎదుర్కొన్నాయి. ఫలితంగా సూచీలు నష్టాలలోకి జారుకున్నాయి. ఇక చివరకు, సెన్సెక్స్ 524.96 పాయింట్లు (0.89%) క్షీణించి 58,490.93 వద్ద స్థిర పడితే, నిఫ్టీ 188.30 పాయింట్లు (1.07%) నష్టపోయి 17,396.90 వద్ద ముగిసింది. నేడు సుమారు 995 షేర్లు అడ్వాన్స్ అయితే, 2308 షేర్లు క్షీణించాయి, 132 షేర్ల విలువ మారలేదు. నేడు డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకపు విలువ 73.63 వద్ద ముగిసింది.
టాటా స్టీల్, జెఎస్ డబ్ల్యు స్టీల్, హిందాల్కో ఇండస్ట్రీస్, యుపీఎల్, ఎస్‌బీఐ షేర్లు నిఫ్టీలో భారీగా నష్టపోతే.. హెచ్ యుఎల్, ఐటీసీ, బజాజ్ ఫిన్ సర్వ్, హెచ్ సీఎల్ టెక్నాలజీస్, బ్రిటానియా ఇండస్ట్రీస్ టాప్ గెయినర్లలో ఉన్నాయి. ఎఫ్ఎంసీజీ మినహా ఇతర అన్ని రంగాల సూచీలు దాదాపు 2 శాతం నష్టపోయాయి.(చదవండి: రేషన్ కార్డు దారులకు కేంద్రం శుభవార్త!)
Comments
Please login to add a commentAdd a comment