న్యూఇయర్ సందర్భంగా దేశవ్యాప్తంగా పలు నగరాల్లో మధ్యం సేల్స్ సరికొత్త రికార్డ్‌లను క్రియేట్ చేశాయి. తెలంగాణ, సిలికాన్ సిటీ ఆఫ్ ఇండియాగా పేరొందిన బెంగళూరు నగరంలో లిక్కర్ సేల్స్ భీభత్సం సృష్టించాయి. అదే సమయంలో లిక్కర్ తో పాటు ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ లో భారీగా జరిగినట్లు పలు రిపోర్ట్‌లు వెలుగులోకి వచ్చాయి.
దేశంలో ఒమిక్రాన్ ఆందోళనల నేపథ్యంలో ప్రజలు న్యూఇయర్ సందర్భంగా పబ్లిక్ ప్రాంతాల్లో తిరిగేందుకు విముఖ వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా హోటల్స్, రెస్టారెంట్స్‌కు వెళ్లకుండా తమకు నచ్చిన ఫుడ్‌ను ఆన్‌లైన్ లో ఆర్డర్ పెట్టుకున్నారు. ప్రముఖ ఫుడ్ డెలవరీ యాప్స్ స్విగ్గీలో డిసెంబర్ 31న యూజర్లు నిమిషానికి 9వేలు ఆర్డర్‌లు పెట్టారు. అలాగే జొమాటోలో నిమిషానికి 8000 ఆర్డర్లు వచ్చాయి. అయితే తమ యాప్‌లో ఎక్కువగా ఏ ఐటెమ్‌కు అధిక ఆర్డర్లు వచ్చాయో కూడా స్విగ్గీ వెల్లడించింది. ఎక్కువ మంది ఆర్డర్ చేసిన ఫుడ్ ఐటమ్స్‌లో బిర్యానీ టాప్‌లో నిలిచింది.
న్యూ ఇయర్ సందర్భంగా ఫుడ్ డెలివరీ యాప్ 2 మిలియన్ ఆర్డర్‌లను దాటిందని స్విగ్గీ ట్విట్టర్‌లో షేర్ చేసింది. గతేడాది మాదిరిగానే ఈ ఏడాది స్విగ్గీ సొంత రికార్డులు బద్దలయ్యాయి, నిమిషానికి వచ్చిన ఆర్డర్‌ల సంఖ్య 5500 మాత్రమే అయితే ఈ సంవత్సరం మొత్తం ఆర్డర్‌ల సంఖ్య నిమిషానికి 9000కి చేరుకుంది. అత్యధికంగా ఆర్డర్ చేసిన ఫుడ్ ఐటమ్ బిర్యానీ అని స్విగ్గీ వెల్లడించింది.
న్యూఇయర్ ఈవీ
న్యూఇయర్ ఈవీ పేరుతో ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్స్ డిసెంబర్ 31(శుక్రవారం రోజు )రాత్రి జరిగిన సేల్స్ గురించి అధికారికంగా రిపోర్ట్‌లను విడుదల చేశాయి. శుక్రవారం రాత్రి స్విగ్గీ మొత్తం 2మిలియన్‌ల ఆర్డర్‌లను కస్టమర్లకు అందించినట్లు చెప్పింది. స్విగ్గీ చెప్పిన వివరాల ఆధారంగా.. 2020 కంటే ఈ ఏడాది ఆర్డర్‌ల డెలివరీ విషయంలో రికార్డ్‌ను క్రియేట్ చేసింది. గతేడాది నిమిషానికి 5,500 ఫుడ్ ఆర్డర్‌లను డెలివరీ చేయగా ఈ ఏడాది 9వేల ఆర్డర్‌లను కస్టమర్లకు అందించింది.
ఇక అందరూ ఎక్కువగా ఇష్టపడే బిర్యానీని కస్టమర్లు నిమిషానికి 1229 ఆర్డర్‌లు ఇచ్చారు. బిర్యానీతో పాటు బటర్ నాన్, మసాల దోశ, పనీర్ బటర్ మసాల, చికెన్ ఫ్రైడ్ రైస్ ఆర్డర్‌లు ఎక్కువగా పెట్టారు.
భారతీయులు ఎక్కువగా డిసెంబర్ 31 రాత్రి ఎక్కువగా 15,458 కార్టన్‌ల ఎగ్స్, 35,177 బ్యాగ్‌ల టమోటాలు, 27,574 ఆనియన్ బ్యాగ్‌లు, 7822 బ్రెడ్ ప్యాకెట్‌లు ఆర్డర్ పెట్టారు.
జుమాటో సైతం
జుమాటో సైతం డిసెంబర్ 31న 2మిలియన్ ఆర్డర్‌లను కస్టమర్లకు అందించినట్లు ఆ సంస్థ సీఈఓ దీపీందర్ గోయల్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment