పుంగనూరు: పుంగనూరుకు మంచిరోజులొచ్చా యి. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి రా వడంతో అంతర్జాతీయ ఖ్యాతి దక్కించుకోబోతోంది. ఒకప్పుడు మహానగరాలకే పరిమితమైన పరిశ్రమలు ఇప్పుడు పుంగనూరులో పెట్టేందుకు ఇ క్కడికి వచ్చి వాలిపోతున్నాయి. రాష్ట్ర మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ పెద్దిరెడ్డి వెంకటమిఽథున్‌రెడ్డి సొంత నియోజకవర్గం పారిశ్రామికాభివృద్ధి బాటపట్టింది. పుంగనూరు ఉపాధి కల్పన కేంద్రంగా మారడంతో మంచి రోజులు వచ్చాయంటూ జనం సంబరాలు చేసుకుంటున్నారు
పుంగనూరులో స్థల పరిశీలన
పెప్పర్ మోషన్ కంపెనీ సీఈఓ శుక్రవారం కలెక్టర్ షణ్మోహన్ ఆధ్వర్యంలో ఎలక్ట్రికల్ బస్సుల తయారీ సంస్థ స్థాపనకు స్థల పరిశీలన చేశారు. ఈ సందర్భంగా ఆండ్రియస్ హేగర్, సీటీఓ డాక్టర్ మదియాస్ కెర్లర్, సీఎస్‌ఓ సత్య, ఫైనాన్స్ డైరెక్టర్ ఉవేస్టెల్డర్, నాఉర్థ్ ఎలక్ట్రిక్ ఎండీ హర్ష ఆధ్యా, పెప్పర్ సీఈఓ రాజశేఖర్‌రెడ్డి, సీఎస్‌ఓ సత్యబులుసు, సీసీఓ రవిశంకర్‌తో కలసి ఆరడిగుంట, వనమలదిన్నె, మే లుందొడ్డి గ్రామాల్లో కేటాయించనున్న 800 ఎకరా ల భూమిని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ ప్రాంతంలో మంచినీరు, విద్యుత్, పుష్కలంగా లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కర్ణాటక, తమిళనాడు సరిహద్దు ప్రాంతమైన పుంగనూరు వ్యా పార లావాదేవీలకు అనువైన ప్రాంతం అని అభివర్ణించారు. రాష్ట్ర మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్‌రెడ్డి కోరిక మేరకు ఇక్కడ కంపెనీ ఏర్పాటు చేస్తున్నామన్నారు. సుమారు 10 వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తుందన్నా రు. ఫిబ్రవరిలోపు పనులు ప్రారంభిస్తామని తెలిపా రు. కంపెనీ ప్రతినిధులు వస్తున్నారన్న సమాచారం తెలియడంతో ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చి వారికి స్వాగతం పలికారు. ఆర్డీఓ మనోజ్‌రెడ్డి, ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి, పీకే ఎం ఉడా చైర్మన్ వెంకటరెడ్డి యాదవ్‌తో కలసి సీఈ ఓ, కలెక్టర్, కంపెనీ ప్రతినిధులకు ఘన స్వాగతం పలికి, శ్యాలువలతో సత్కరించారు. సీమ జిల్లాల మైనార్టీ సెల్ ఇన్‌చార్జ్ ఫకృద్ధిన్‌షరీఫ్, మున్సిపల్ చైర్మన్ అలీమ్‌బాషా, రాష్ట్ర జానపదకళల సంస్థ చైర్మన్ కొండవీటి నాగభూషణం, పార్టీ మండల అధ్యక్షుడు కొత్తపల్లె చెంగారెడ్డి, సచివాలయాల కన్వీనర్ రాజశేఖర్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ కార్యదర్శులు చంద్రారెడ్డి యాదవ్, దేశిదొడ్డి ప్రభాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. డీఎస్పీ సుధాకర్‌రెడ్డి, సీఐ రాఘవరెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
జర్మన్ కంపెనీ బృందం పరిశీలన
ఎదురుచూసిన జనం
మంత్రి పెద్దిరెడ్డి, ఎంపీ మిథున్‌ల కృషి
నిరుద్యోగులకు ఉపాధి
పడమటి నియోజకవర్గమైన పుంగనూరు మండలంలో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన జర్మన్ పెప్పర్ ఎల్‌క్ట్రికల్ బస్సుల కంపెనీ ఏర్పాటు చేయడం జిల్లా చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ రోజని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ కొనియాడారు. కంపెనీ ప్రతినిధులతో కలసి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రమంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ పెద్దిరెడ్డి వెంకటమిథున్‌రెడ్డి చొరవతో పరిశ్రమ ఏర్పాటు అవుతోందన్నారు. నిరుద్యోగులు ఉపాధి కోసం వలసలు వెళ్లకుండా ఇక్కడే సుమారు 8 వేల మందికి ఉ పాధి లభిస్తుందని కలెక్టర్ స్పష్టం చేశారు. స్థాని క ప్రజలు, ప్రజాప్రతినిధులు పూర్తి సహకారం అందించి, కంపెనీ త్వరితగతిన పూర్తి చేసేందుకు కృషి చేయాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment