రాష్ట్ర కబడ్డీ విజేత చిత్తూరు
స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ నిర్వహించిన రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీల్లో చిత్తూరు బాలికల జట్టు విజేతగా నిలిచింది.
అక్కడే అధికం
జిల్లాలో ఇంజినీరింగ్ కళాశాలలతో పాటు వైద్య కళాశాలలు, డీమ్డ్ యూనివర్సిటీలో చదువుకునే యువతే లక్ష్యంగా డ్రగ్స్ అమ్మకాలు జరుగుతున్నాయి. ఇందులో చిత్తూరు నగరంతో పాటు దాదాపు అన్ని పట్టణాల్లోనూ డ్రగ్స్ వ్యాపారం బాగానే సాగుతోంది. ఇటీవల చిత్తూరులోని ఓ ప్రముఖ కళాశాలలో మిథైలెనెడియోక్సీ–మెంథాఫేటమైన్ (ఎండీఎంఏ) అనే డ్రగ్ ప్యాకెట్ లభించగా, బయటకు తెలిస్తే విద్యాసంస్థ పరువు పోతుందని నిర్వాహకులు దాన్ని అలాగే తొక్కిపెట్టేశారు. ఎండీఎంఏ అనే మాదకద్రవ్యాన్ని బెంగళూరు నుంచి ఒక గ్రాము రూ.2 వేలకు కొనుగోలుచేసి, దాన్ని చిత్తూరులోని యువతకు గ్రాము రూ.4 వేల వరకు అమ్ముతున్నట్లు సమాచారం ఉంది. డ్రగ్స్‌ను ఉపయోగిస్తే బరువు తగ్గుతారని, ఏవెంజర్స్‌లా అద్భుతమైన శక్తి వస్తుందన్న ఊహాగానాలతో యువత ఆకర్షితలవుతున్నారు. ఏదైనా గలాటా కేసులు, చోరీ కేసుల్లో ఒకరిద్దరు మాత్రమే నష్టపోతారు. హత్య కేసులో ఓ కుటుంబం బాధింపబడుతుంది. కానీ మాదకద్రవ్యాల వినియోగంలో సమాజం మొత్తం ఇబ్బంది పడుతుంది. తన, మన అనే ఆలోచన లేకుండా మనుషుల్ని మృగాలుగా చేసే ఈ మత్తు పదార్థాలు విద్యా సంస్థల్లో వ్యాపిస్తుండడం ఆందోళనగా మారుతోంది.
– 8లో
– 8లో
Comments
Please login to add a commentAdd a comment