రామకుప్పం: గత మూడు నెలలుగా తమకు జీతాలు ఇవ్వకుండా ప్రభుత్వం నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తోందని 108 ఉద్యోగులు వాపోయారు. నాలుగో నెల వస్తున్నా పండగ పూట తమకు జీతాలు ఇవ్వకపోవడంతో ఏమి చేయాలో తెలియని అయోమయ స్థితిలో ఉన్నామన్నారు. గత 18 ఏళ్లుగా రేయింబవళ్లు కష్టపడుతున్నామని పండగ పూట జీతాలు ఇవ్వకపోతే ఎలా? అని ఉద్యోగులు ప్రశ్నించారు. అందరు ఉద్యోగస్తులు దసరా, దీపావళి పండుగలు సంతోషంగా జరుపుకుంటున్నారని 108/104 ఉద్యోగుల కుటుంబాలు మాత్రం పస్తులుండాల్సిన పరిస్థితి నెలకొందని 108 యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి లక్ష్మీనారాయణ అన్నారు. ప్రభుత్వం ఇప్పటికై నా స్పందించి తమకు జీతాలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా 108 ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈఎంటీలు మాణిక్యం నాయక్, ఎల్లప్ప, ధనపాల్ నాయక్, పైలట్‌లు సురేష్ ,ఽగంగాధరం, ఈశ్వరయ్య పాల్గొన్నారు.
నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలుపుతున్న 108 ఉద్యోగులు
Comments
Please login to add a commentAdd a comment