చిత్తూరు కలెక్టరేట్: సామాజిక పింఛన్లను లబ్ధిదారులకు శుక్ర, శనివారాల్లో మాత్రమే పంపిణీ చేయనున్నట్లు కలెక్టర్ సుమిత్‌కుమార్ తెలిపారు. ఇంటి వద్దకే సచివాలయ సిబ్బంది ద్వారా నవంబర్ నెలకు సంబంధించిన పింఛన్లు అందజేస్తామన్నారు. జిల్లాలో 2,68,820 మందికి దాదాపు రూ.113.43 కోట్లు విడుదల చేసినట్లు చెప్పారు. శుక్రవారం ఉదయం నుంచి కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు. ఆ రోజు ఇంటివద్ద లేని లబ్ధిదారులకు శనివారం మాత్రమే అందజేస్తామని పేర్కొన్నారు. ఆ రోజుల్లో లబ్ధిదారులు అందరూ తమ ఇంటి వద్దనే ఉండి పెన్షన్ తీసుకోవాలన్నారు.
తిరుపతి డీఎంహెచ్‌వోపై విచారణ పూర్తి
చిత్తూరు రూరల్ (కాణిపాకం): చిత్తూరు నగరంలోని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో బుధవారం తిరుపతి డీఎంహెచ్‌ఓ శ్రీహరిపై విచారణ పూర్తయింది. మూడు రోజుల పాటు జరిగిన ఈ విచారణలో గతంలో పనిచేస్తున్న అధికారులు, సిబ్బందిని విచారించారు. రాత పూర్వకంగా వివరాలు తీసుకున్నారు. ప్రైవేటు ఆస్పత్రుల నిర్వాహకులు, ఇంకొంత మంది ఈ విచారణకు పెద్దగా ఆసక్తి చూపలేదు. అయితే విచారణ అంశాలను నివేదికల రూపంలో తయారు చేసి రాష్ట్ర అధికారులకు సమర్పించనున్నట్లు విచారణ అధికారి విజయలక్ష్మీ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment