శ్రీకాంత్‌కు అండగా వైఎస్సార్‌సీపీ
పూతలపట్టు: కూటమి నాయకుల దాడిలో గాయపడిన పూతలపట్టు మండల వైఎస్సార్‌సీపీ కన్వీనర్ శ్రీకాంత్‌రెడ్డికి పార్టీ అండగా ఉంటుందని రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి తెలిపారు. ఆయన శుక్రవారం చిత్తూరు కట్టమంచిలోని అద్దె ఇంటిలో ఉన్న శ్రీకాంత్‌రెడ్డిని పరామర్శించారు. ఇలాంటి దాడులకు భయపడాల్సిన అవసరం లేదని, అన్ని విధాలుగా పార్టీ అండగా ఉంటుందని భరోసానిచ్చారు. దాడులకు, అక్రమ కేసులకు భయపడవద్దని, తమకు కొండంత అండగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఉన్నారని స్పష్టం చేశారు. పార్టీ కోసం కష్టపడుతున్న నాయకులు, కార్యకర్తలను టీడీపీ నాయకులు టార్గెట్ చేస్తున్నారని గుర్తుచేశారు. అనంతరం ఎంపీ మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఐదు నెలలైనా ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా పార్టీ కోసం కష్టపడేవారిపై దాడులు చేస్తోందని దుయ్యబట్టారు.
చంద్రబాబుక పరిపాలన చేతగాక దాడులు చేస్తున్నట్లు వాపోయారు. మండలానికి చెందిన ముఖ్యమైన నాయకుడిపై దాడిచేస్తే మిగిలిన కార్యకర్తలు భయపడతారనే భ్రమలో టీడీపీ నాయకులు ఉన్నారని చెప్పారు. వారు చేసిన అక్రమాలకు సమాధానం చెప్పే రోజు త్వరలోనే వస్తుందని, ఆ రోజు ఎవరినీ వదిలేది లేదని తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని పోస్టులు పెడితే వారిపై దాడి చేసి, అక్రమ కేసు పెట్టే ఏకై క ప్రభుత్వం ఇదేనన్నారు. ఈ ఐదు నెలల్లో ప్రభుత్వం ప్రజల కోసం ఏం చేసిందని ప్రశ్నించారు. రాష్ట్రంలోని ప్రజలు కూటమి ప్రభుత్వం రాకతో చాలా ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పూతలపట్టు నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ సునీల్‌కుమార్, మాజీ ఎమ్యెల్యే లలితకుమారి, నాయకులు తలపులపల్లి బాబురెడ్డి, పాలఏకరి చైర్మన్ కుమార్‌రాజా, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ రాహుల్‌రెడ్డి, పట్నం ప్రతాప్‌రెడ్డి, పాలేరు రామచంద్రారెడ్డి, కార్పొరేటర్ హరిణిరెడ్డి, పరమేశ్వర్‌రెడ్డి, సుధాకర్‌రెడ్డి, పూతలపట్టు ఎస్సీ సెల్ అధ్యక్షులు కోదండరామ, మురళి, షణ్ముగం, కార్యకర్తలు పాల్గొన్నారు.
పలమనేరు డీఎస్పీని కలిసిన ఎంపీ మిథున్ రెడ్డి
పలమనేరు: పుంగనూరు అల్లర్ల కేసుకు సంబంధించి రాజంపేట పార్లమెంటు సభ్యులు మిథున్‌రెడ్డి శుక్రవారం పలమనేరు డీఎస్పీ కార్యాలయానికి వచ్చారు. అక్కడి పోలీసులు పెట్టిన కేసులకు సంబంధించి హైకోర్టు వీరికి కండీషన్ బెయిల్ మంజూరు చేసింది. ఇందులో భాగంగా స్థానిక డీఎస్పీ డేగల ప్రభాకర్ ఈ కేసుకు ఐవోగా ఉన్నందున ఎంపీ ఇక్కడికి న్యాయవాదులతో వచ్చి నిబంధనల మేరకు డీఎస్పీని కలిసి వెళ్లారు. ఆయనకు పలమనేరు, పూతలపట్టు మాజీ ఎమ్మెల్యేలు వెంకటేగౌడ, డా.సునీల్, జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులు నియోజకవర్గ నేతలు స్వాగతం పలికారు.
Comments
Please login to add a commentAdd a comment