No Headline
తమిళంలోనే చదువుకుంటున్నా..
మా పూర్వీకులు అందరూ తమిళ సంస్కృతిని పాటించేవారే. తరతరాలుగా ఇంట్లో మాట్లాడే భాష కూడా తమిళమే. పాటించే ఆచారాలు కూడా తమిళ సంస్కృతివే. అందుకే ఆంధ్రరాష్ట్రంలో ఉన్నా తల్లిదండ్రులు నన్ను తమిళ మాధ్యమంలో చేర్చారు. తమిళంతో పాటు ఒక సబ్జెక్ట్ తెలుగు కూడా నేర్చుకుంటున్నా.
– చిత్ర, సత్రవాడ, నగరి మున్సిపాలిటీ
ఆ విద్యార్థులు ఎక్కువే ఉన్నారు..
సత్రవాడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నేను తమిళ మాధ్యమం చదువుకుంటున్నా. నాలాగే పలువురు విద్యార్థులు తమిళంలోనే చదువుకుంటున్నారు. ఎలాంటి భేదాభిప్రాయాలు లేకుండా మాకు పాఠాలు చెబుతుండడంతో చక్కగా చదువుకుంటున్నాం. మాతృభాష తమిళంతో పాటు రాష్ట్ర భాష తెలుగును కూడా నేర్చుకుంటున్నాం.
– జయలక్ష్మి, సత్రవాడ, నగరి మున్సిపాలిటీ
భాషపై మక్కువతోనే తెలుగు మీడియం..
మా మాతృభాష తెలుగు. ఇంటిలో మేము తెలుగే మాట్లాడుకుంటాం. అందుకే భాషపై మక్కువతో నా తల్లిదండ్రులు నన్ను తెలుగు మీడియంలో చేర్పించారు. తెలుగు సబ్జెక్ట్‌తో పాటు అన్ని సబ్జెక్టులు తెలుగులోనే చెబుతున్నారు. వీటితో పాటు తమిళ భాషను కూడా నేర్చుకుంటున్నా.
– కరిష్మా, చంద్రప్పనాయుడు కండ్రిగ, తిరుత్తణి తాలుకా
Comments
Please login to add a commentAdd a comment