ఎయిడ్స్ రహిత సమాజాన్ని నిర్మిద్దాం
చిత్తూరు కలెక్టరేట్ : ఎయిడ్స్ మహమ్మారి లేని సమాజాన్ని నిర్మించేందుకు అన్ని వర్గాల వారు తమ వంతు కృషి చేయాలని కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ అన్నారు. డిసెంబర్ 1న ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం కలెక్టరేట్‌లో అవగాహన పోస్టర్‌ను ఆవిష్కరించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఎయిడ్స్ వల్ల కలిగే నష్టాలను తెలియజేసేందుకు జిల్లా వ్యాప్తంగా ముమ్మరంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పారు. హెచ్‌ఐవీ కేసులు తగ్గించేందుకు అవగాహన కార్యక్రమాలు ఎంతో దోహదం చేస్తాయన్నారు. జిల్లాలోని ఆస్పత్రులు, జన సమూహం ఉన్న కూడళ్లలో బ్యానర్లు ప్రదర్శించాలని సూచించారు. నాగరికత అభివృద్ధి చెందుతున్న కొద్దీ వింత పోకడలు వస్తున్నాయన్నారు. హెచ్‌ఐవీ పాజిటివ్ వచ్చిన వారు ఏఆర్‌టీ మందులు తప్పనిసరిగా వాడటం మొదలుపెట్టాలని తెలిపారు. ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో డీఎంహెచ్‌వో ప్రభావతిదేవి, అడిషనల్ డీఎంహెచ్‌వో వెంకటప్రసాద్, వ్యాధి నిరోధక టీకాల అధికారి హనుమంతరావు, ఆర్‌బీఎస్‌కే కో ఆర్డినేటర్ శిరీష తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment