నివారణతోనే ఎయిడ్స్ కట్టడి
చిత్తూరు రూరల్ (కాణిపాకం): ఎయిడ్స్ కట్టడికి నివారణ ఒక్కటేమార్గమని డీఎంహెచ్ఓ ప్రభావతిదేవి అన్నారు. చిత్తూరు నగరం మురకంబట్టులోని లారీ అసోసియేషన్ వద్ద గురువారం ఎయిడ్స్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఎయిడ్స్ వ్యాధిపై అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ వ్యాధి వ్యాప్తిపై ప్రతిఒక్కరూ అవగాహన కలిగి ఉండాలన్నారు. తప్పు చేసే ముందు కుటుంబ సభ్యులు ఉన్నారనే విషయాన్ని గుర్తు తెచ్చుకోవాలన్నారు. అనంతరం కరపత్రాలను ఆవిష్కరించారు. కార్యక్రమంలో టీబీ అధికారి వెంకటప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment