ఆత్మీయ నివాళి
సోదరుడు, మాజీ ఎమ్మెల్యే నారా రామ్మూర్తి నాయుడికి గురువారం సీఎం చంద్రబాబుతో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు అంజలి ఘటించారు. రామ్మూర్తి నాయుడి కర్మక్రియల్లో భాగంగా సీఎం చంద్రబాబు, ఆయన తనయుడు నారా లోకేష్ ఇతర కుటుంబ సభ్యులు బుధవారం నారావారిపల్లెకు చేరుకున్నారు. అనంతరం గ్రామంలోని బావి వద్ద సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్, నారా రోహిత్, నారా గిరీష్తో కలసి పిండ ప్రదానం, కర్మక్రియల్లో పాల్గొన్నారు. హిందూ సంప్రదాయ పద్ధతిలో కర్మక్రియలు పూర్తి చేశారు. శుక్రవారం ఉదయం సీఎం తిరుగు ప్రయాణం కానున్నారని జిల్లా అధికార యంత్రాంగం ఓ ప్రకటనలో తెలిపింది. – చంద్రగిరి
Comments
Please login to add a commentAdd a comment