సెలెస్ట్రా–25 పోస్టర్ ఆవిష్కరణ
తిరుపతి సిటీ: పద్మావతి మహిళా వర్సిటీ స్కూల్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్ విభాగాల సంయుక్త ఆధ్వర్యంలో వచ్చేనెల 28వ తేదీ నుంచి రెండు రోజుల పాటు జరగనున్న సెలెస్ట్రా–25 ఈవెంట్‌కు సంబంధించిన పోస్టర్లను వీసీ ఉమ, రిజిస్ట్రార్ రజిని విడుదల చేశారు. వర్సిటీలో శుక్రవారం జరిగిన ఈ కార్యక్రమంలో వీసీ మాట్లాడుతూ యువ ఆవిష్కర్తలు తమ సరికొత్త ఆలోచనలను పదర్శించడానికి ఈ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. కార్యక్రమంలో ప్రొఫెసర్లు పీ.మల్లికార్జున, వీ.సరిత, డాక్టర్ ఎన్.సాయిలోహిత, బీ.లక్ష్మీదేవి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment