రాష్ట్ర స్థాయి ఖోఖో పోటీలు ప్రారంభం
పుత్తూరు: స్థానిక ఎస్‌ఆర్‌ఎస్ ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో గురువారం అండర్–19 రాష్ట్ర స్థాయి ఖోఖో పోటీలను డీవైఈఓ ప్రభాకర్‌రాజు ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్ర స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ పోటీలు మూడు రోజుల పాటు జరుగుతాయని తెలిపారు. ఈ పోటీల్లో 13 జిల్లాలకు చెందిన అండర్–19 బాల బాలికల జట్లు పాటీపడతాయని తెలిపారు. పోటీల అనంతరం రాష్ట్ర బాల బాలికల జట్ల ఎంపిక జరుగుతుందని వెల్లడించారు. ఎంపికై న రాష్ట్ర జట్లు ఢిల్లీలో నిర్వహించనున్న జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటాయని వివరించారు. ప్రతి ఒక్కరూ క్రీడా స్ఫూర్తితో ఆడి రాష్ట్ర జట్టుకు ఎంపిక కావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ ఏకాంబరాచ్చారి, బాలికల కళాశాల ప్రిన్సిపల్ రఘుపతి, రాష్ట్ర ఖోఖో అబ్జర్వర్ ఈశ్వర్‌నాయక్, ఎస్‌జీఎస్ సెక్రటరీ జయరామయ్య, ఇతర క్రీడా సంఘాల నాయకులు బాబు, శరత్, బాలాజీ, సుబ్రమణ్యంరెడ్డి, పీడీలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment