ఆర్నెళ్లకే మార్పు మొదలైంది
నగరి : వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్‌మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు పెనుమార్పుకు నాంది పలికాయి. ఆర్నెళ్లలోనే కూటమి ప్రభుత్వం ప్రజల విశ్వనీయతను కోల్పోతోంది. అందుకు నగరి మున్సిపాలిటీ కేవీపీఆర్ పేటలో టీడీపీ ప్రధాన నేత ఈకే అయ్యప్పన్ తన అనుచరులు వందమందితో కలిసి మాజీ మంత్రి ఆర్‌కే రోజా సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరడమే అందుకు సాక్ష్యంగా నిలుస్తోంది. శనివారం కేవీపీఆర్ పేటలోని తన నివాసం వద్ద ఈకే అయ్యప్పన్ భారీ జనం మధ్య మాజీ సీఎం జగన్ జన్మదిన వేడుకలను మాజీ మంత్రి రోజాతో కలిసి జరుపుకున్నారు. అనంతరం ఆమె సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరారు. ఇకపై వైఎస్ జగన్, రోజా నాయకత్వాన్ని బలపరుస్తామన్నారు. అనంతరం ఆమె అందరికీ వైఎస్సార్‌సీపీ కండువాలు వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ ఆర్నెళ్లకే కూటమి పాలన గురించి ప్రజలకు అర్థమైపోయిందని, అన్ని వర్గాల వారిలో వస్తున్న మార్పు స్పష్టంగా కనిపిస్తోందన్నారు. ఈరోజు వైఎస్ జగనన్న జన్మదిన వేడుకలే ఆ మార్పునకు నాంది పలికాయన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
గత ఐదేళ్ల పాలనలో అంతా సంక్షేమమే
సంక్షేమం గాలికొదిలేసిన కూటమి సర్కారు
టీడీపీని వీడి వైఎస్సార్‌సీపీలోకి
నగరి ముఖ్య నేత అయ్యప్పన్
సుమారు 100 మందితో పార్టీలో చేరిక
కండువా వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించిన మాజీమంత్రి రోజా
Comments
Please login to add a commentAdd a comment