హోరాహోరీగా ఖోఖో పోటీలు
పుత్తూరు: స్థానిక ఎస్‌ఆర్‌ఎస్ ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో గత రెండు రోజులుగా జరుగుతున్న అండర్–19 రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలు హోరాహోరీగా జరుగుతున్నాయి. శనివారం జరిగిన క్వార్టర్ ఫైనల్స్ పోటీలను డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ బి.చంద్రమౌళి ప్రారంభించారు. ఈ పోటీల్లో చిత్తూరు జిల్లా బాలికల జట్టు శ్రీకాకుళం జట్టును 11–2 స్కోర్‌తో ఓడించి సెమీస్‌కు చేరుకుంది. అలాగే మరో మ్యాచ్‌లో అనంతపురం జిల్లా జట్టు కడప జట్టుపై 11–1 స్కోర్‌తో గెలుపొంది సెమీస్ బెర్త్ ఖాయం చేసుకుంది. బాలుర విభాగంలో ప్రకాశం జిల్లా జట్టు నెల్లూరు జట్టుపై 14–2 స్కోర్‌తో గెలుపొందగా, మరో మ్యాచ్‌లో విశాఖ జిల్లా జట్టు అనంతపురం జట్టుపై 16–4 స్కోర్‌తో గెలిచి సెమీస్‌కు సిద్ధమయ్యాయి. ఉత్కంఠభరితంగా జరిగిన చివరి రెండు క్వార్టర్ ఫైనల్స్‌లో శ్రీకాకుళం జట్టు కడప జట్టుపై 8–7 స్కోర్‌తో, అలాగే చిత్తూరు జట్టు విజయనగరం జట్టుపై 10–9 స్కోర్‌తో గెలిచి రెండో సెమీ ఫైనల్స్ బెర్తులు ఖాయం చేసుకున్నాయి. ఆదివారం జరగనన్న ఫైనల్స్ మరింత ఉత్కంఠభరితంగా జరుగుతాయని నిర్వాహకులు తెలిపారు. పోటీలను ఎస్‌జీఎస్ సెక్రటరీ జయరామయ్య, రాష్ట్ర పరిశీలకులు ఈశ్వర్‌నాయక్, క్రీడా సంఘాల నాయకులు బాబు, శరత్, బాలాజీ, సుబ్రమణ్యంరెడ్డి, పీడీలు పర్యవేక్షించారు.
సెమీస్‌కు చేరిన బాలికల చిత్తూరు, అనంతపురం జట్లు
బాలుర విభాగంలో ప్రకాశం, విశాఖ, శ్రీకాకుళం, చిత్తూరు జట్లు
Comments
Please login to add a commentAdd a comment