24వ తేదీలోపు ఓటరు క్లెయిమ్స్ పరిష్కారం
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లావ్యాప్తంగా ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ నెల 24వ తేదీలోపు ఓటర్ల క్లెయిమ్స్ పరిష్కారం చేయనున్నట్లు డీఆర్‌ఓ మోహన్‌కుమార్ తెలిపారు. ఈ మేరకు శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో ఓటరు జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ ప్రక్రియను పకడ్బందీగా చేపడుతున్నట్లు తెలిపారు. ఈ ప్రక్రియలో మొత్తం 1,32,000 క్లెయిమ్స్ అందగా, వివిధ కారణాలతో 40,107 తిరస్కరించగా, 92,117 క్లెయిమ్స్‌ను ఆమోదించినట్లు తెలిపారు. పెండింగ్‌లో ఉన్న క్లెయిమ్స్‌ను గడువు తేదీ లోపు పరిష్కరిస్తామన్నారు. జిల్లా వ్యాప్తంగా విభిన్నప్రతిభావంతులు, వయోవృద్ధుల ఉపకరణాల పంపిణీ శిబిరాలు పకడ్బందీగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇప్పటి వరకు ఐదు శిబిరాలు పూర్తి కాగా, 2500 మంది వివిధ ఉపకరణాలకు తమ పేర్లను నమోదు చేసుకున్నట్లు చెప్పారు. ఈ నెల 24వ తేదీన సదస్సులు ముగుస్తాయన్నారు. రెండు నెలల్లో ఉపకరణాలను సమకూర్చిన అనంతరం మరోమారు శిబిరాలు నిర్వహించి ప్రస్తుతం దరఖాస్తు చేసుకుని అర్హత పొందిన వారికి వాటిని ఉచితంగా అందజేస్తామన్నారు. ఈ అవకాశాన్ని జిల్లాలోని అర్హులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. జిల్లావ్యాప్తంగా ఇప్పటి వరకు 422 గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు పూర్తయినట్లు తెలిపారు. నిర్ణీత షెడ్యూల్‌లోపు రెవెన్యూ సదస్సులు పూర్తి చేసి అందిన వినతులన్నింటినీ పరిష్కరించేలా చర్యలు చేపడుతున్నట్లు డీఆర్‌ఓ వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment