క్రిస్మస్ సుఖసంతోషాలతో జరుపుకోవాలి
పుంగనూరు: జిల్లాలోని క్రైస్తవులందరూ సుఖ సంతోషాలతో క్రిస్మస్ పండుగను జరుపు కోవాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి ఆకాంక్షించారు. క్రిస్‌మస్ పండుగను పురస్కరించుకుని క్రైస్తవులకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. మంగళవారం మాజీ మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రా జంపేట ఎంపీ పెద్దిరెడ్డి వెంకటమిఽథున్‌రెడ్డి వేర్వురుగా ఈ మేరకు ప్రకటనలు విడుదల చేశారు. క్రిస్మస్ పండుగను క్రైస్తవులు వారి కుటుంబ సభ్యులతో కలసి పండుగజరుపుకుని, ఆనందంగా ఉండాలని కోరారు.
రేపు పడిమెట్ల పూజోత్సవం
సదుం: మండలంలోని ఎర్రాతివారిపల్లె కోటమలై అయ్యప్పస్వామి ఆలయంలో గురువారం పడిమెట్ల పూజోత్సవం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు చెప్పారు. ప్రతి ఏటా డిసెంబరు 26న ఆలయ వ్యస్థాపక ధర్మకర్త, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో ఆలయంలోని ప ద్దెనిమిది మెట్లకు కేరళ సంప్రదాయ రీతిలో ప్ర త్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ పూజను తిలకించేందుకు పలు ప్రాంతాల నుంచి అయ్యప్ప భక్తు లు పెద్ద ఎత్తున తరలివస్తారు. ఈ నేపథ్యంలో ఆలయాన్ని సర్వాంగ సుందరంగా వివిధ రకాల పుష్పాలతో అలంకరిస్తున్నారు.
28న మొగిలీశ్వరాలయ దుకాణాల వేలం
బంగారుపాళెం: మొగిలి శివాలయానికి సంబంధించిన వివిధ దుకాణాలకు ఈ నెల 28వ తేదీ లీజు వేలం నిర్వహించనున్నట్లు ఈఓ మునిరాజు, వంశ పారంపర్య ధర్మకర్త విజయకుమార్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆ లయ ఆవరణలో ఉదయం 11 గంటలకు దేవదాయశా ఖ అధికారుల సమక్షంలో వాహనాల పా ర్కింగ్, కొబ్బరి కాయలు, పూజాసామగ్రి విక్రయం, పా దరక్షలు భద్రపరడం, కొబ్బరి చిప్పలు, తలనీలా లు పోగు చేసుకునే హక్కుకు సంబంధించి బహి రంగ వేలం నిర్వహించనున్నట్లు తెలిపారు. తలనీలాలు పోగు చేసుకునే హక్కుకు సంబంధించి రూ.50 వేలు, ఇతర వేలం పాటల్లో పాల్గొ నడానికి రూ.5 వేలు డిపాజిట్ చెల్లించాలన్నారు. ఈ నెల 4వ తేదీన జరగాల్సిన వేలం వాయిదా పడి న విషయం తెలిసిందేనన్నారు. వివరాలకు కా ర్యాలయ సిబ్బందిని సంప్రదించాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment