27న ప్రజల పక్షాన పోరుబాట
చిత్తూరు కార్పొరేషన్: రాష్ట్ర ప్రజలపై విద్యుత్ చార్జీల భారం మోపడాన్ని నిరసిస్తూ వైఎస్సార్‌సీపీ ప్రజల పక్షాన ఈ నెల 27వ తేదీన పోరుబాట పట్టనుంది. జిల్లా వ్యాప్తంగా విద్యుత్ కార్యాలయాల వద్ద పోరుబాట పేరుతో నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చింది. చిత్తూరులోని పార్టీ కార్యాలయంలో మంగళవారం నియోజకవర్గ ఇన్‌చార్జ్ విజయానందరెడ్డి నాయకులతో కలిసి పోరుబాట పోస్టర్లను విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అవసరం తీరాక ఇచ్చిన మాటను మరిచిపోవడం చంద్రబాబుకు అలవాటుగా మారిందన్నారు. ఎన్నికల ముందు విద్యుత్ చార్జీలను తగ్గిస్తామని బాబు చెప్పారన్నారు. అసలు పెంచబోమని కూడా చెప్పిన మాటలు అందరికీ గుర్తున్నాయన్నారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత రాష్ట్ర ప్రజలపై పెనుభారాన్ని మోపుతున్నారని ధ్వజమెత్తారు. విద్యుత్ చార్జీలు, రిజిస్ట్రేషన్ ఫీజుతో పాటు వివిధ పన్నులు పెంచడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారని చెప్పారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ రాకపోవడంతో కళాశాలల యాజమాన్యాలు విద్యార్థులను ఇంటికి పంపుతున్నాయని విమర్శించారు. రాష్ట్ర ప్రజలపై విద్యుత్ చార్జీల పెంపు రూపంలో రూ.15,484 కోట్లు భారం వేస్తున్నారన్నారు.
విద్యుత్ చార్జీల పెంపుపై ఆందోళన
ట్రాన్స్‌కో డీఈ కార్యాలయం ఎదుట నిరసన
పోస్టర్ ఆవిష్కరించిన విజయానందరెడ్డి
ప్రజలపై రూ.15,484 కోట్లు
భారం మోపిన కూటమి ప్రభుత్వం
Comments
Please login to add a commentAdd a comment