ప్రజల పక్షాన వైఎస్సార్‌సీపీ చేపడుతున్న పోరు బాట నిరసన కార్యక్రమానికి వినియోగదారులు పెద్దఎత్తున తరలివచ్చి, విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో నిరసన తెలియజేయడంతో పాటు అధికారులకు వినతిపత్రాలు అందించనున్నట్లు వెల్లడించారు. శుక్రవారం చిత్తూరు కట్టమంచి చెరువు సమీపంలోని వివేకానంద విగ్రహం వద్ద ర్యాలీని ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. ఉదయం 9.30 గంటలకు నియోజకవర్గ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, వినియోగదారులు అక్కడికి చేరుకోవాలన్నారు. తర్వాత ఫ్లకార్డుల ప్రదర్శనతో ర్యాలీగా గాంధీరోడ్డులోని ట్రాన్స్‌కో డీఈ కార్యాలయానికి చేరుకుంటామని చెప్పారు. అక్కడ నిరసన వ్యక్తం చేసి, డీఈకి వినతిపత్రం అందించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో పార్టీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు గాయత్రీదేవి, నాయకులు కృష్ణారెడ్డి, అంజలిరెడ్డి, మధుసూదన్‌రాయల్, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment