ముగిసిన ఉద్యోగోన్నతులు | - | Sakshi
Sakshi News home page

ముగిసిన ఉద్యోగోన్నతులు

Published Wed, Dec 25 2024 12:40 AM | Last Updated on Wed, Dec 25 2024 12:40 AM

ముగిసిన ఉద్యోగోన్నతులు

ముగిసిన ఉద్యోగోన్నతులు

చిత్తూరు కలెక్టరేట్‌ : చిత్తూరు, తిరుపతి జిల్లాల పరిధిలోని కార్పొరేషన్‌, మున్సిపల్‌ పాఠశాలల ఉపాధ్యాయులకు నిర్వహించిన ఉద్యోగోన్నతుల ప్రక్రియ ముగిసింది. మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు చిత్తూరు డీఈఓ కార్యాలయంలో ఉద్యోగోన్నతుల ప్రక్రియ నిర్వహించారు. సాయంత్రం కౌన్సెలింగ్‌ ప్రక్రియను చేపట్టి రాత్రి 7 గంటలకు పూర్తి చేశారు. ఈ ప్రక్రియను డీఈఓ వరలక్ష్మి పర్యవేక్షించారు. ఈ ఉద్యోగోన్నతుల ప్రక్రియలో అర్హులైన ఎస్జీటీలకు స్కూల్‌ అసిస్టెంట్‌ ఇంగ్లిష్‌ 4, గణితం 1, ఫిజిక్స్‌ 1, బయాలజీ 8, సోషల్‌ 10, తమిళ మీడియం సోషల్‌ 1, తెలుగు మీడియం గణితం 1, తెలుగు మీడియం ఫిజిక్స్‌ 1 పోస్టులకు ఉద్యోగోన్నతులు కల్పించారు. అనంతరం ఉద్యోగోన్నతులు పొందిన టీచర్లకు డీఈఓ వరలక్ష్మి నియామక ఉత్తర్వులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏడీ వెంకటేశ్వరరావు, సూపరింటెండెంట్‌ రామ్‌కుమార్‌, సత్య, సీనియర్‌ అసిస్టెంట్‌లు మురళి, గోపాల్‌ తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement