చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలో ఇసుక డిపోలు ప్రైవేట్ వ్యక్తులతో నిర్వహించనున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలో ఇసుకరీచ్‌లు లేనందున చిన్నతరహా వినియోగదారుల సేవలకు ప్రైవేటు వ్యక్తుల ఆధ్వర్యంలో ఇసుక డిపోలను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. చిత్తూరు, నగరి, పలమనేరులో ఇసుక నిల్వ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. సొంత రవాణా వాహనాలు, సొంత భూమి, లీజు భూమి ఒప్పంద పత్రాలు (కనీసం ఒక ఎకరం స్థలం) ఉండాలన్నారు. అర్హతలుండి, నిల్వ కేంద్రాలు ఏర్పాటు చేయాలనుకునే వారు వచ్చే జనవరి 4 తేదీ మధ్యాహ్నం 3 గంటలలోపు జిల్లా కేంద్రంలోని ఇండస్ట్రియల్ ఎస్టేట్‌లో ఉన్న జిల్లా గనులు, భూగర్భశాఖ కార్యాలయంలో దరఖాస్తులు చేసుకోవాలన్నారు. ఈ ప్రక్రియకు ప్రీ బిడ్డింగ్ ప్రక్రియ నిర్వహిస్తారన్నారు. ఇతర వివరాలకు 7013886327 నంబర్‌లో సంప్రదించాలని కలెక్టర్ వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment