మదనపల్లె ఫైళ్ల దగ్ధం కేసులో గౌతమ్‌కు రిమాండ్
చిత్తూరు అర్బన్: మదనపల్లె ఫైళ్ల దగ్ధం కేసులో గౌతమ్‌ను రిమాండ్‌కు తరలించారు. అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్–కలెక్టరేట్‌లో జరిగిన ఫైళ్ల ద గ్ధం కేసులో సీనియర్ అసిస్టెంట్ గౌతంతేజ (32)ను సీఐడీ పోలీసులు సోమవారం చిత్తూరులోని నా లుగో అదనపు మునిసిఫ్ మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు. ఈ ఏడాది జూలై 21న జరిగిన అగ్ని ప్రమాదం కేసులో అక్కడ పనిచేసిన పలువురు అ ధికారుల ప్రమేయం ఉన్నట్లు సీఐడీ పోలీసులు అభియోగాలు మోపారు. ఈ నేపథ్యంలో పలమనేరు లో గౌతంతేజను సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు. అక్కడి నుంచి నిందితుడిని చి త్తూరు కోర్టుకు తీసుకొచ్చారు. అ ప్పటికే కోర్టు స మయం ముగిసిపోవడంతో నిందితుడిని న్యాయమూర్తి షేక్ బాబాజాన్ ఇంటి వద్ద హాజరుపరచగా, జనవరి 10వ తేదీ వరకు రిమాండ్‌కు ఆదేశించారు. అనంతరం గౌతం తేజను చిత్తూరులోని జిల్లా జైలుకు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment