పీహెచ్‌సీల్లో తనిఖీలు
కుప్పంలో సీఎం పర్యటన ఉన్న నేపథ్యంలో డీఎంహెచ్‌ఓ గురువారం పీహెచ్‌సీల్లో విస్తృతంగా తనిఖీ చేపట్టారు.
నాణ్యత డొల్ల...?
రబీ సీజన్ కావడంతో ఓవైపు మామిడి పూత ఆరంభం, మరోవైపు వరి సాగు, ఇతరత్రా కూరగాయల పంటలు సాగవుతుంటాయి. ఇక వర్షాభావ పరిస్థితులు ఈ పంటలను సోకి ఎదుగుదల, దిగుబడిపై దెబ్బతీస్తుంటాయి. ఇలాంటి తరుణంలో పలు రకాల పురుగు మందులు, ఎరువులు, విత్తనాలు రైతులకు అవసరమవుతాయి. కొంతమంది స్థానిక ప్రాంతాల్లో లభ్యమయ్యే వాటిని కొనుగోలు చేసి పిచికారీ చేస్తుంటారు. మరికొందరు ఇక్కడ విక్రయించే వాటిల్లో నాణ్యత లేదని.. పక్క రాష్ట్రాలకు వెళ్లి తెచ్చుకుంటున్నారు. చిత్తూరు, గుడిపాల, జీడీనెల్లూరు, పూతలపట్టు రైతులు తమిళనాడులోని పొన్నై, వేలూరును ఆశ్రయిస్తున్నారు. ఎస్‌ఆర్‌పురం, పాలసముద్రం, కార్వేటినగరం రైతులు తమిళనాడులోని పళ్లిపట్టుకు వెళ్తున్నారు. యాదమరి, బంగారుపాళ్యం రైతులు తమిళనాడులోని పరదరామిలో కొనుగోలు చేసుకుంటున్నారు. పలమనేరు, వీకోట రైతులు తమిళనాడులోని గుడియాత్తం, కర్ణాటకలోని బేతమంగళం, కుప్పంలోని రైతులు తమిళనాడు సరిహద్దులోని ఎరువుల దుకాణాల్లో తెచ్చుకుంటున్నారు.
– 8లో
Comments
Please login to add a commentAdd a comment