ఒంటరి ఏనుగు బీభత్సం
బంగారుపాళెం: మండలంలోని వెలుతురుచేనులో ఒంటరి ఏనుగు పంటలను ధ్వంసం చేసింది. గ్రామానికి చెందిన శ్రీనివాసులు సాగుచేసిన టమాటా, చెరుకు పంటలను బుధవారం రాత్రి ధ్వంసం చేసిందని బాధిత రైతు వాపోయాడు. ఏనుగు దాడి గురించి అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వగా వారు వచ్చి దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. పరిహారం చెల్లించేందుకు ఉన్నతాధికారులకు నివేదికలు పంపుతామన్నారు. డిసెంబరు నెలలో కూడా ఏనుగులు పంటలపై దాడి చేశాయని పలువురు రైతులు తెలిపారు. ఒంటరి ఏనుగు మండలంలోని సామచేనుమిట్ట వద్ద ఓ ఇంటిని ధ్వంసం చేసిన విషయం తెలిసిందేనన్నారు. పంట పొలాలపైకి ఏనుగులు రాకుండా నివారణ చర్యలు చేపట్టాలని అటవీశాఖ అధికారులను కోరారు.
Comments
Please login to add a commentAdd a comment