దేవుడి మాన్యం భూమి కబ్జా
శ్రీరంగరాజపురం: మండలంలోని అధికార పార్టీకి చెందిన ఓ నేత ప్రభుత్వ భూమితో పాటు దేవుడి మాన్యం భూమిని ఆక్ర మించి కోళ్లపారం నిర్మిస్తున్నాడని రెవెన్యూ అధికారులకు పిల్లిగుండ్లపల్లి గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. వివరాలు.. బుధవారం కటికపల్లెలో జరిగిన రెవెన్యూ సదస్సు జరిగింది. ఈ సందర్భంగా పిల్లిగుండ్లపల్లికి చెందిన గ్రామస్తులు మాట్లాడుతూ కటికపల్లి రెవెన్యూ లెక్కదాఖలాలోని సర్వే నంబర్ 223/1లో 1.47 ఎకరాల స్థలం విఘ్నేశ్వరుడి ఆలయ మాన్యం భూమి అనాధీనం అని ఉందన్నారు. ఈ భూమిని తమ గ్రామానికి చెందిన హేమాద్రినాయుడు నకిలీ పట్టాలను సృష్టించి ఆక్రమించుకున్నాడని తెలిపారు. కానీ ప్రభుత్వ రికార్డుల్లో ఎక్కడా అతనికి డీకేటీ పట్టా ఇచ్చినట్లు లేదన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక గుట్ట పొరంబోకు స్థలాలు, కట్టవ స్థలాలు.. ఇలా ఏదీ వదలకుండా కబ్జా చేస్తున్నాడని ఆరోపించారు. పెద్దపెద్ద చెట్లను కూడా కొట్టేసి చదును చేసుకుని కోళ్లఫారం నిర్మిస్తున్నా రెవెన్యూ అధికారులు స్పందించకపోవడం ఏమిటని ప్రశ్నించారు. అందుకే కటికపల్లిలో జరిగిన రెవెన్యూ సభలో తహసీల్దార్‌కు ఫిర్యాదు చేశామన్నారు. వెంటనే దేవుడి మాణ్యం భూమి, ప్రభుత్వ స్థలాన్ని స్వాధీనం చేసుకుని రక్షించాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment