పేద విద్యార్థులకు శాపం
వెదురుకుప్పం: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడితే కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు పేద విద్యార్థులకు శాపంగా మారుతున్నాయని మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి ఆరోపించారు. మంగళవారం ఆయన జర్మనీ నుంచి సాక్షితో మాట్లాడుతూ తెలుగు మహాసభల పేరుతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల్లో ఉన్న పేద విద్యార్థులకు ఇంగ్లిషు మీడియం లేకుండా చేయాలన్న నిరంకుశత్వ ధోరణితో ప్రముఖులు వ్యాఖ్యానించడం ఆక్షేపణీయమన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేల పిల్లలు ఇంగ్లిషు మీడియంలో చదువుతుంటే ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిషు మీడియంలో విద్యాబోధనను వ్యతిరేకించడంపై మండిపడ్డారు. జస్టిస్ రమణ తెలుగుకు ప్రాధాన్యం ఇవ్వలేదని అనడంతో పాటు పేద విద్యార్థులకు ఇంగ్లిషు అందకుండా చేయండనేలా పరోక్ష వ్యాఖలు చేయడం సరికాదన్నారు. సూపర్ సిక్స్ అమలు చేయకుండా గత ప్రభుత్వంపై అభాండాలు వేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల పట్ల దళిత మేధావులు, ప్రజా సంఘాల ప్రతినిధులు మేల్కొని పేదలకు అండగా నిలవాలని పిలుపునిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment