● లేని కులాలకు మద్యం దుకాణాలు ● అత్యధిక జనాభా గల ప్రాంత
కల్లు గీత కార్మికుల తల రాతను మార్చేస్తామంటూ కూటమి ప్రభుత్వం ఊదరగొట్టింది. సులభతరంగా పది శాతం మద్యం దుకాణాలు కేటాయిస్తామంటూ చిలక పలుకులు వల్లించింది. అతి తక్కువ రుసుముతోనే దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పిస్తామని ఆశలు కల్పించింది. అయితే వాస్తవంలోకి వస్తే మీ రాత మారే పరిస్థితి ఏమాత్రం లేదంటూ చేతల ద్వారా స్పష్టంగా తెలియజేసింది. వైన్‌షాపుల కేటాయింపుల్లో పలు కులాలకు తీరని అన్యాయం చేసింది. శుక్రవారం కలెక్టరేట్‌లో పారదర్శకత పేరుతో చేపట్టిన లాటరీని ప్రహసనంగా మార్చేసింది. కుల సంఘాల నేతల అభ్యంతరాలను బేఖాతర్ చేసింది. తూతూమంత్రంగా కలెక్టర్‌తో హామీ ఇప్పించి సమస్యను పక్కదారి పట్టిస్తోంది.
లేనివాళ్లకు ఎలా..?
జిల్లాలో కల్లు గీత కింద ఉండేదంతా ఈడిగలే. అయితే షాపులు నాలుగు కులాలకు ఇచ్చినారు. లేనివాళ్లకు షాపులు ఇచ్చే బదులు, ఉండే కులాలకే ఇస్తే న్యాయం జరగతాది. అప్పుడే మేము ఎదిగేదానికి వీలుపడతాది. ఎలా పడితే అలా చేస్తే నిజంగా మాకు నష్టమే.
– కృష్ణమూర్తిగౌడ్,
ఈడిగ సంఘ జిల్లా అధ్యక్షుడు
Comments
Please login to add a commentAdd a comment