ప్రభుత్వ స్థలాలకు ‘పచ్చ’ రంగు!
చిత్తూరు పాత బస్టాండ్‌కు ప్రహరీ కింద పెట్టిన రేకులకు పచ్చ రంగు వేయడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి.
ఆక్రమణలను ఉపేక్షించం
వి.కోట : ప్రభుత్వ భూములను అక్రమిస్తే ఎంతటి వారైనా ఉపేక్షించే ప్రసక్తే లేదని, కఠిన చర్యలు తప్పవని ఆర్‌డీఓ భవానీ హెచ్చరించారు. శుక్రవారం పలమనేరు రోడ్డులో వివాదాస్పద షాదీమహల్ స్థలాన్ని పరిశీలించారు. పకడ్బందీగా సర్వే చేసి ఆక్రమణలను తొలగించాలని రెవెన్యూ సిబ్బందిని ఆదేశించారు. అనంతరం మండలంలోని నెర్నిపల్లె పంచాయతీ మిట్టూరు గ్రామంలో ఇరు కుటుంబాల మధ్య వివాదాస్పదంగా మారిన స్థలాన్ని ఆర్‌డీఓ పరిశీలించారు. భూమి రికార్డులను ఇరు వర్గాల వారు సమర్పించాలని సూచించారు. ఈ క్రమంలోనే రెవెన్యూ సదస్సుల్లో ప్రజల నుంచి వచ్చిన వినతులపై సమీక్షించారు. వాటిని తక్షణం పరిష్కరించాలని అధికారులకు స్పష్టం చేశారు. తహసీల్దార్ పార్వతి, ఆర్‌ఐ మోహన్‌రెడ్డి పాల్గొన్నారు.
అలసత్వం వహిస్తే చర్యలు
చిత్తూరు కలెక్టరేట్ : ప్రజా సమస్యల పరిష్కార వేదికలో నమోదయ్యే అర్జీల పరిష్కారంలో అధికారులు అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని కలె క్టర్ సుమిత్‌కుమార్ గాంధీ హెచ్చరించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో పలు శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ తమ సమస్యలను తీరుస్తారని ప్రజలు ఎంతో నమ్మకంతో అధికారుల వద్దకు వస్తారని, ఆర్థికపరమైనవి మినహాయించి, ఇతర అర్జీలను నిర్ణీత గడువులోపు పరిష్కరించాలని ఆదేశించారు. సమావేశంలో ట్రైనీ కలెక్టర్ హిమవంశీ పాల్గొన్నారు.
ఉపాధి కూలీలకు మెరుగైన వసతులు
జిల్లాలోని ఉపాధి కూలీలకు మెరుగైన వసతులు కల్పించాలని కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ ఆదేశించారు. జిల్లా సేవా సంఘం ఎస్సీ, ఎస్టీ ఉపాధి హామీ డైరీని ఆయన ఆవిష్కరించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఉపాధి కూలీలకు ఎలాంటి సమ స్యలు తలెత్తకుండా చర్యలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో డ్వామా పీడీ రవికుమార్, సంఘం జిల్లా అధ్యక్షుడు గుణశేఖర్, సభ్యులు అన్నామలై, మురుగేషన్, కిరణ్‌కుమార్, వాలే నాయక్ పాల్గొన్నారు.
– IIలో
Comments
Please login to add a commentAdd a comment