రత్నగిరికి భక్తుల తాకిడి | - | Sakshi
Sakshi News home page

రత్నగిరికి భక్తుల తాకిడి

Published Mon, Dec 9 2024 2:31 AM | Last Updated on Mon, Dec 9 2024 2:31 AM

రత్నగిరికి భక్తుల తాకిడి

రత్నగిరికి భక్తుల తాకిడి

సత్యదేవుని దర్శించిన 30 వేల మంది

రూ.30 లక్షల ఆదాయం

అన్నవరం: రత్నగిరిపై వెలసిన శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామివారి ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. సెలవు దినం కావడానికి తోడు శనివారం రాత్రి రత్నగిరితో పాటు పలు ప్రాంతాల్లో వివాహాలు చేసుకున్న నవ దంపతులు, వారి బంధువులు వేలాదిగా తరలి వచ్చారు. దీంతో ఆలయ ప్రాంగణం, వ్రత, విశ్రాంతి మండపాలు భక్తులతో కిటకిటలాడాయి. సత్యదేవుని దర్శించిన భక్తులు సప్తగోకులంలో గోవులకు ప్రదక్షిణ చేసి, శ్రీకృష్ణునికి పూజలు చేశారు. సుమారు 30 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. సత్యదేవుని వ్రతాలు 1,800 జరిగాయి. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.30 లక్షల ఆదాయం సమకూరింది. సత్యదేవుని నిత్యాన్నదాన పథకంలో 4 వేల మంది అన్నప్రసాదం స్వీకరించారు.

కన్నుల పండువగా రథోత్సవం

స్వామివారి ఆలయ ప్రాకారంలో సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవారి రథోత్సవం ఘనంగా నిర్వహించారు. ఉదయం పది గంటలకు రథాన్ని తూర్పు రాజగోపురం ముందుకు తీసుకువచ్చారు. అనంతరం మేళతాళాల మధ్య ఆ రథంపై సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవార్ల విగ్రహాలను అర్చకులు వేంచేయించి పూజలు చేశారు. అనంతరం దేవస్థానం అసిస్టెంట్‌ కమిషనర్‌ రామ్మోహన్‌రావు కొబ్బరికాయ కొట్టి రథోత్సవాన్ని ప్రారంభించారు. పెద్ద సంఖ్యలో భక్తులు వెంట రాగా ఆలయ ప్రాకారంలో రథోత్సవం ఘనంగా నిర్వహించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement