అయినవిల్లిలో భక్తుల సందడి
అయినవిల్లి: అయినవిల్లి విఘ్నేశ్వర స్వామివారి ఆలయం ఆదివారం భక్తులతో కిక్కిరిసింది. అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ప్రధానార్చకుడు అయినవిల్లి సూర్యనారాయణ మూర్తి ఆధ్వర్యంలో స్వామికి మేలుకొలుపు సేవ, పంచామృతాభిషేకాలు, ఏకాదశ, లఘున్యాస, రుద్రాభిషేకాలు, వివిధ పూజలు జరిపారు. స్వామికి మహానివేదన అనంతరం వివిధ పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. స్వామివారి లఘున్యాస, ఏకాదశ రుద్రాభిషేకాల్లో 40 మంది, పంచామృతాభిషేకాల్లో నలుగురు, లక్ష్మీగణపతి హోమంలో 8 మంది భక్త దంపతులు పాల్గొన్నారు. పది మంది చిన్నారులకు నామకరణ, అక్షరాభ్యాసాలు, తులాభారం, 24 మంది నూతన వాహన పూజలు చేయించుకున్నారు. నిత్యాన్నదాన పథకంలో 1,560 మంది అన్నప్రసాదం స్వీకరించారు. ఆలయానికి వివిధ పూజలు, అన్నదాన విరాళాలుగా రూ.1,96,429 ఆదాయం లభించిందని ఆలయ ఈఓ, అసిస్టెంట్ కమిషనర్ ముదునూరి సత్యనారాయణ రాజు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment