మనుగడకు ముప్పు తేవొద్దు
రాజమహేంద్రవరం రూరల్: జీవిత బీమా సంస్థ ఉన్నతికి దోహదపడిన దేశంలోని 14 లక్షల మంది ఏజెంట్ల మనుగడకు నష్టం కలిగించే విధంగా యాజమాన్యం ప్రవర్తించడం సరికాదని, పాలసీదారుల ప్రయోజనాలకు ఇబ్బందులు వస్తాయని అఖిల భారత జీవిత బీమా ఏజెంట్ల సమాఖ్య (లియాఫీ) రాజమండ్రి డివిజనల్ అధ్యక్షుడు రావుల మాధవరావు అన్నారు. జీవిత బీమా సంస్థ ఏజెంట్ల మనుగడకు భంగం కలిగించే విధంగా యాజమాన్యం తీసుకున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా అఖిల భారత జీవిత బీమా ఏజంట్ల సమాఖ్య (లియాఫి) పిలుపు మేరకు సోమవారం మో రంపూడి ఎల్‌ఐసీ రాజమహేంద్రవరం డివిజనల్ ఆఫీ సు ఎదుట రాజమహేంద్రవరం డివిజన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం మహాధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రాజమహేంద్రవరం డివిజనల్ అధ్యక్షుడు రావుల మాధవరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ భారతీయ జీవిత బీమా సంస్థ(లియాఫి) సెప్టెంబర్ 30 వరకు అమలులో ఉన్న పాలసీలు అన్నింటిని క్లోజ్ చేసి అక్టోబర్ ఒకటో తేదీ నుంచి కొత్త పాలసీలను ప్రవేశపెట్టిందన్నారు. అందులో ఏజెంట్లకు కస్టమర్లకు ఇ బ్బంది కలిగించే విషయాలను పొందుపరిచిందన్నా రు. క్లా బ్యాక్ కమిషన్ స్ట్రక్చర్ని మార్చడం, మినిమం బీమా మొత్తాన్ని రూ.రెండు లక్షలకు పెంచడం, పాలసీల్లో వయోపరిమితిని తగ్గించటం, ప్రీమియం రేట్లు పెంచడం చేసిందన్నారు. వీటన్నిటిని వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. అక్టోబర్ ఒకటో తేదీ నుంచి చేస్తున్న తమ ఆందోళనను పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఆలిండియా ఈసీ సభ్యుడు మస్తాన్, ప్రధాన కార్యదర్శి ఎం.ఎన్.వి.ఎస్.ఎన్.మూర్తి (నాగబాబు), గౌరవ అధ్యక్షుడు వంగా త్రిమూర్తులు, జోనల్ వైస్ ప్రెసిడెంట్ దొరబాబు, జోనల్ మెంబర్ సాంబమూర్తి, కోశాధికారి పిండి రెడ్డమ్మ, ఆల్ ఇండియా ఈసీ మెంబర్ అరవింద్, సీడబ్ల్యూఏ డివిజన్ అధ్యక్షుడు వేమూరి శ్రీనివాస్ మాట్లాడారు. మెయిన్ బ్రాంచి అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు పీవీఎస్ కృష్ణారావు, అధ్యక్షుడు గండిబోయిన శ్రీనివాసరావు, సెక్రటరీ పట్నాల సుధాకర్, రూరల్ బ్రాంచి ప్రెసిడెంట్ ఆదిమూలం సాయిబాబా, డివిజన్‌లోని 20బ్రాంచ్‌ల నుంచి ఏజెంట్‌లు మహాధర్నాలో పాల్గొన్నారు.
పాలసీదారులకు, ఏజెంట్లకు నష్టం చేస్తున్న ఎల్‌ఐసీ యాజమాన్యం
ధ్వజమెత్తిన యూనియన్ నాయకులు
Comments
Please login to add a commentAdd a comment