మహిళ అదృశ్యం
ముమ్మిడివరం: అనారోగ్యంతో బాధపడుతున్న తన తల్లి ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదని ఆమె కుమారుడు ముమ్మిడివరం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ముమ్మిడివరం నగర పంచాయతీ రాయుడువారిపాలెంకు చెందిన బొక్కా వెంకట రమణ రెండు రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదని కుమారుడు విజయరాజు ఫిర్యాదు చేశాడు. ఎస్సై డి.జ్వాలాసాగర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
వ్యక్తి దుర్మరణం
కొవ్వూరు: చాగల్లు–కొవ్వూరు మధ్య డీలైన్ ట్రక్ మధ్య ఆదివారం రాత్రి విజయవాడ–విశాఖపట్నం వైపు వెళ్లే రైలు నుంచి జారిపడి గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందాడు. వయసు 45 ఏళ్లు ఉండవచ్చునని రైల్వే పోలీసులు చెబుతున్నారు. మృతదేహాన్ని కొవ్వూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కుడిచేతిపై ఈశ్వర్ అని, కుడి జబ్బపై త్రిశూలం, నాగు పాము, ఢమరుకం గుర్తులతో పచ్బ బొట్టు ఉంది. నిడదవోలు రైల్వే హెడ్ కానిస్టేబుల్ డి.శ్రీనివాసరావు కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment